- తక్షణం సైన్యాన్ని రంగంలోకి దింపాలన్న సిఎం కేజ్రీవాల్
- అల్లర్లపై కేంద్ర కేబినేట్ అత్యవసర చర్చ
- అల్లర్లకు కారణాలను ఆరా తీస్తున్న అజిత్ ధోవల్
- 106 మంది అరెస్టు, 18 మందిపై ఎఫ్ఐఆర్
- అప్రమత్తంగా ఉండాలని భారత్‌లోని అమెరికన్లకు యుఎస్ ఎంబసీ సూచన
ఢిల్లీ అల్లర్ల మృతలు సంఖ్య 22కి చేరింది. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతున్నది. ఈ నెల 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. సుమారు 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ పరిస్థితులపై కేందర కేబినేట్ చర్చించనుంది. అలాగే అల్లర్ల అదుపునకు సైన్యాన్ని రంగంలోకి దింపాలని సిఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. మరోవైపు ఈ ఘటనలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ విమర్శించింది. ఇందుకు బాధ్యత వహించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాచేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను, హింసను అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది.
ఘర్షణలను అదుపు చేసే బాధ్యతను జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌కు కేంద్రం అప్పగించినట్లు సమాచారం. ఈ క్రమంలో గతరాత్రి జాఫ్రాబాద్, సీలాంపూర్ సహా ఈశాన్య ఢిల్లీలో అజిత్ దోవల్ పర్యటించారు. వివిధ వర్గాల ప్రతినిధులతో అజిత్ దోవల్ చర్చలు జరిపారు. జాతీయ భద్రత వ్యవహారాల మంత్రివర్గ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి అజిత్ దోవల్ హాజరై ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను వివరించే అవకాశం ఉంది. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత రెండు రోజుల్లో మూడుసార్లు సక్ష జరిపారు. ఢిల్లీలో ఘటనపై ఢిల్లీ హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తూర్పు ఢిల్లీలోని రెండు ప్రాంతాలలో తాజాగా మరోసారి హింసాకాండ చెలరేగిన దరిమిలా ప్రజలలో విశ్వాసాన్ని పాదుగొల్పడానికి వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోతున్నారని కేజీవ్రాల్ అన్నారు. వెంటనే సైన్యాన్ని రప్పించి అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలలో కర్ఫూ విధించాలని ఆప్ అధినేత బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ కూడా రాస్తానని ఆయన చెప్పారు. అదనపు బలగాలు మోహరించినా కొన్ని చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు కేజీవ్రాల్. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దించాలన్న కేజీవ్రాల్.. ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే కర్ఫ్యూ విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తున్నానని సీఎం అరవింద్ కేజీవ్రాల్ డియాకు తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది.