Take a fresh look at your lifestyle.

24‌వ రోజు కలెక్టరేట్ల ముట్టడి

ఫోటో హైదరాబాద్‌ ‌కలెక్టరేట్‌ ‌వద్ద అఖిలపక్షం నిరసన..
ఫోటో హైదరాబాద్‌ ‌కలెక్టరేట్‌ ‌వద్ద అఖిలపక్షం నిరసన..

కదం తొక్కిన ఆర్టీసీ కార్మికులు
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌
‌సీఎం కేసీఆర్‌ ‌తీరు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం
కలెక్టర్‌లకు వినతిపత్రాలు అందజేత

ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు ఉధృతం చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, తద్వారా సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఇప్పటికే 24రోజులుగా ఆందోళన బాట పట్టిన కార్మికులు.. సోమవారం తెలంగాణ జిల్లాల్లోని కలెక్టరేట్‌ల వద్ద కథం తొక్కారు. కలెక్టరేట్‌ల ఎదుట బైఠాయించి తమ నిరసనను తెలిపారు. న్యాయపరమైన పోరాటానికి మద్దతుగా అన్ని సంఘాలను, నాయకులను ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లోని కలెక్టర్‌లు, జేసీలకు సమస్యల పరిష్కారంకోసం వినతిపత్రాలు అందజేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దని, ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆర్టీసీ జేఏసీ కార్మికులు బైటాయించి కలెక్టర్‌ ‌హరీష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం ఉదయం కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ ‌మానిక్‌ ‌రాజ్‌కు వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యలపై కలెక్టర్‌ ‌సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హా ఇచ్చారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని 9డిపోల పరిధిలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏకశిల పార్కు నుంచి కలెక్టరేట్‌ ‌వరకు కార్మికులు ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్‌, ‌సీపీఐ, సీపీఎం నేతలు సమ్మెకు మద్దతు పలికారు. కాగా కార్మికుల ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. కేసీఆర్‌ ‌నియంతృత్వ విధానాలతో పాలన సాగిస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని, విధుల నుంచి తొలగించి ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కుట్రపన్నారని కార్మికులు విమర్శించారు. కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మికులు తొసుకెళ్లే ప్రయత్నం చేయగా, వారిని అడ్డుకున్న పోలీసులు ఆర్టీసీ జేఏసీ నేతలకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగాసాగింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేస్తూ కార్మికులు ఆందోళన బాట పట్టారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ ‌వద్ద బైటాయించారు. కొద్దిసేపు ఆందోళన అనంతరం మహబూబ్‌నగర్‌ ‌జాయింట్‌ ‌కలెక్టర్‌కు వినతిపత్రాన్నిఅందజేశారు. అదేవిధంగా వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయాల వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్‌ల ఎదుట బైఠాయించి తమ నిరసనను తెలిపారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్‌లు, జేసీలకు వినతిపత్రాలు అందజేశారు. వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా చేసి వారి డిమాండ్ల వినతి పత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. రాజన్న సిరిసిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడి చేసే యత్నంలో పోలీసులకు, ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య తోపులాట జరగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు కార్మికులను అక్కడి నుంచి తరలించి వేశారు. దీంతో ఆర్టీసీ జేఏసీ నాయకులను కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించేందుకు అనుమతివ్వడంతో జేఏసీ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించి తమసమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగింది. కార్మికులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేస్తూ కలెక్టరేట్‌ ‌వద్ద ఆందోళనలు చేపట్టాయి. ఖమ్మం కలెక్టరేట్‌ ‌వద్ద ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో చేరుకొని ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్‌ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులను దోచుకొనేందుకు కార్మికులను రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పలువురు ఆర్టీసీ జేఏసీ నాయకులు కలెక్టరేట్‌లోకి అనుమతివ్వడంతో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కలెక్టరేట్‌ ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy