Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొత్తగా 2,392 కొరోనా కేసులు

దేశవ్యాప్తంగా 75,809 మందికి పాజిటివ్‌

సోమవారం రాత్రి వరకు 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,392 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నిర్దారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1,45,163కు చేరాయి. తాజాగా వైరస్‌తో 11 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 906కు చేరింది. తాజాగా వైరస్‌ ‌నుంచి 2,346 మంది వైరస్‌ ‌నుంచి కొలుకోగా, మొత్తం 1,12,587 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,670 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 24,579 మంది •ం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం ఉండగా, దేశంలో 1.69గా ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 77.5శాతంగా ఉందని పేర్కొంది. సోమవారం ఒకే రోజు 60,923 శాంపిల్స్ ‌పరీక్షించగా.. ఇప్పటి వరకు 18,27,905 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇంకా 1,606 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 49,234 మందికి టెస్టులు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.

దేశవ్యాప్తంగా 75,809 మందికి పాజిటివ్‌
‌దేశవ్యాప్తంగా కొరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ ‌కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా పాజిటివ్‌ ‌కేసులు నిర్దారణ అయిన దేశాల్లో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా దేశంలో 75,809 కోవిడ్‌ ‌కేసులు నిర్దారణ అయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. అలాగే వైరస్‌ ‌ప్రభావంతో మరో 1,133 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 42,80,423కు చేరాయి. ప్రస్తుతం 8,83,697 యాక్టివ్‌ ‌కేసులున్నాయని, 33,23,951 మంది బాధితులు కోలుకున్నారని, 72,775 మంది వైరస్‌ ‌ప్రభావంతో మరణించారని హెల్త్ ‌మినిస్ట్రీ తెలిపింది. సోమవారం ఒకే రోజు 10,98,621 టెస్టులు చేయగా..5,06,50,128 శాంపిల్స్ ‌పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ ‌వివరించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply