Take a fresh look at your lifestyle.

24 ‌గంటల్లో 2,34,692 మందికి పాజిటివ్‌

  • 1341 ‌మంది మృత్యువాత
  • నాలుగు రోజుల్లో కేసులు 27 శాతం..మరణాలు 30శాతం పెరుగుదల
  • దేశంలో కొరోనా కరాళ నృత్యం
  • మహారాష్ట్రలోనూ ఆగని కల్లోలం

దేశంలో కొరోనా వైరస్‌ ‌కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకు పాజిటివ్‌ ‌కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రధాన హాస్పిటళ్లలో బెడ్ల కొరత, ఆక్సిజన్‌ ‌సిలిండర్ల కొరత, రెమ్‌డెసివర్‌ ‌కొరతలను అధిగమించే చర్యలు కానరావడం లేదు. ప్రజలు ఇంటిపట్టునే ఉండాలని, బయటకు రావొద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. మళ్లీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వాతావరణం సూచిస్తున్నది. గడిచిన 24 గంటల్లోనే 2,34,692 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, 1,341 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం 1,23,354 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 16,79,740. ఇప్పటి వరకు కొరోనాతో 1,75,649 మంది చనిపోగా, 1,26,71,220 మంది ఈ వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 11,99,37,641 మంది కొరోనా వ్యాక్సిన్‌ ‌తీసుకున్నారు. వరుసగా మూడో రోజు కొవిడ్‌ ‌కేసులు రెండు లక్షలకు పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 14.95లక్షల టెస్టులు చేయగా 2,34,692 కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరింది. రికవరీ రేటు 87.80 శాతంగా ఉంది. మరోవైపు ఇక రెండో దశలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రోజుకు వెయ్యి మందికి పైనే కొరోనాకు బలవుతున్నారు. కొరోనా వెలుగులోకి వొచ్చిన నాటి నుంచి మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,75,649కు చేరింది. ఇక మరణాల రేటు 1.22శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 16,79,740 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి.

కేసులు పెరుగుతున్న తరుణంలో టీకా పక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. శుక్రవారం మొత్తం 30.04 లక్షల మందికి పైగా టీకాలు వేయగా.. మొత్తం టీకాలు పొందిన వారి సంఖ్య 11.99కోట్లు దాటింది. మహారాష్ట్రలో కేసుల విజృంభణ కొనసాగుతున్నది.శుక్రవారం ఒక్కరోజే 61,695 కేసులు నమోదు కాగా.. 349 మంది కొరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దిల్లీలో 16,699 కేసులు నమోదు కాగా, 112 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, దిల్లీ సహా దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో మృతుల సంఖ్య పెరిగి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడటంతో.. ఆక్సిజన్‌ ‌లభ్యతపై  ప్రధాని మోదీ అధికారులతో సవి•క్షించారు. డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఉత్పత్తిని పెంచాలని ఆయన సూచించారు. నిరంతర ఆక్సిజన్‌ ‌సరఫరా చేసేందుకు 24 గంటలూ ట్యాంకర్లను నడపాలని ఇందుకోసం డ్రైవర్లు షిప్టుల వారీగా పనిచేసేలా మార్పులు చేయాలని సూచించారు. గంటగంటకూ పరిస్థితి మారిపోతున్నది. ఆక్సిజన్‌ ‌సిలిండర్ల నుంచి అంబులెన్స్‌ల వరకు.. హాస్పిటళ్లలో పడకల నుంచి రెమ్‌డెసివిర్‌ ఔషధం వరకు.. ఆరోగ్యం విషమంగా ఉన్న రోగులకు ప్లాస్మా దానం నుంచి శ్మశానాల్లో అంత్యక్రియలకు స్థలం వరకు అన్నిటికి డిమాండ్‌ ‌పెరుగుతున్నది. ఈ వొత్తిడిని తట్టుకునే పరిస్థితిలో లేక వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్త్తున్నది. ఢిల్లీలో అసాధారణ రీతిలో కొరోనా విజృంభణతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముంబై కంటే ఇక్కడ వైరస్‌ ఉధృతి దాదాపు రెట్టింపుగా ఉంది. ఆధునిక వైద్య సదుపాయాలు, ఎయిమ్స్, ‌సప్దర్‌జంగ్‌, ‌రాంమనోహర్‌ ‌లోహియా వంటి ప్రభుత్వ హాస్పిటళ్లు ఉన్నా ఢిల్లీ ఇలాంటి స్థితిని ఎదుర్కొంటుండడంతో ప్రధాని కార్యాలయం సైతం తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిసింది.

Leave a Reply