Take a fresh look at your lifestyle.

ఏపీలో కొత్తగా 2,345 కరోనా కేసులు

అమరావతి,జూలై16 : గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,345 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 19,34,450కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 16 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 13,097 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 24, 854 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 18,96,499 మంది రికవరీ అయ్యారు.

ఏపీలో 24 గంటల్లో 3,001 మంది రికవరీ అయ్యారు. ••ంటూరు జిల్లాలో ముగ్గురు, విశాఖ జిల్లాలో ఒకరు మృతి కరోనాతో మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

Leave a Reply