కరోనాతో మరో 106 మంది మృతి
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 23,160 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 14,98,532కి కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 106 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 9,686 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 12,79,110 మంది రికవరీ అయ్యారు. ఓవైపు కరోనా వైరస్.. మరోవైపు బ్లాక్ ఫంగస్ ముప్పేట దాడి కరోనా బాధితులకు కంటి ద కునుకు లేకుండా చేస్తున్నాయి. హమ్మయ్య కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నాంలే అని ఊపిరి పీల్చుకునే లోపు.. బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది.
దాన్ని గుర్తించడంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా.. గుర్తించిన తర్వాత అలసత్వం ప్రదర్శించినా ప్రాణానికే ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి, కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వారికి బ్లాక్ ఫంగస్ పెను సవాల్ విసురుతోంది.