Take a fresh look at your lifestyle.

23 ‌నుంచి తెరుచుకోనున్న థియేటర్లు వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి

వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి
రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా వరకు సినిమాలు ఓటీటీని ఆశ్రయించాయి. అయితే కొన్ని పెద్ద సినిమాలు థియేటర్‌ ‌రిలీజ్‌కోసం వేచి ఉన్నాయి. క్యూలో ఉన్న సినిమాలన్నీ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వొచ్చే అవకాశం ఉంది. కొరోనా కేసులు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

థియేటర్ల మూసివేతతో ఇప్పటికే అవి నష్టాల్లో కూరుకుపోయాయి. అలాగే కరెంట్‌ ‌బిల్లులు కూడా కట్టలేని స్థితికి చేరుకున్నాయి. మళ్లీ థియేటర్లు తెరిచి సినిమాలు విడుదలయితేనే అవి నడిచే అవకాశం ఉంది.

Leave a Reply