Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా 22,752 కొత్త కేసులు

24 గంటల్లో కొరోనాతో 482 మంది మృతి

దేశంలో కొరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 20వేలకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 22,752 కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోలిస్తే మరో ఐదు వందల కేసులు పెరిగాయి. ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం  7,42,417 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,64,944 కేసులు యాక్టివ్‌ ‌గా ఉంటే, 4,56,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 482 మంది మృతి చెందారు.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 20,642కి చేరింది. ఇకపోతే  గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,62,679 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక మొత్తంగా 1,04,73,771 కొరోనా టెస్టులు ఇండియాలో నిర్వహించారు. కేసుల పట్టికలో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. అమెరికా, బ్రెజిల్‌ ‌తరువాత ఇండియాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

Leave a Reply

error: Content is protected !!