Take a fresh look at your lifestyle.

‘ఈత’రం.. మారింది.!

సిద్ధిపేట-చంద్లాపూర్‌లోని ర•ంగనాయక సాగర్‌, ‌ప్రధాన కాలువలకు గోదావరి జలాలు రావడంతో.. స్థానిక యువత ఆనందంతో కేరింతలు కొడుతూ.. కాలువల్లో ఈతలు కొట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సోమవారం అక్కడకు చేరుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఏం సంగతి బిడ్డ.. కాల్వల్లో ఈత కొడుతున్నారా.. అంటూ ఆప్యాయంగా యువతను మంత్రి పలకరించారు. మా ఊర్లకునీళ్లు వచ్చినయ్‌ ‌సార్‌. ఇక మాకు సంబరమైతుందని.. అందుకే కాలువల్లో ఈత కొడుతున్నట్లు.. యువకులు చెప్పుకొచ్చారు. పొద్దున, సాయంత్రం ఈత కొట్టాలని అసలే ఎండాకాలం ఈ సమయంలో.. ఈతలు కొట్టాలని యువకులకు మంత్రి హితవు పలికారు. కాళేశ్వరం నీళ్లు కాల్వల ద్వారా గ్రామాల్లోకి చేరడంతో.. ఈతరం మారుతున్నదని స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి ముచ్చటించారు.

ఇదిలా ఉంటే, చంద్లాపూర్‌ ‌ప్రధాన ఎడమ కాలువ నుంచి పిల్ల కాలువ తీయడం ద్వారా చిన్నకోడూర్‌, ‌బెల్లంకుంట, పెద్ద చెరువు నిండనున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా చంద్లాపూర్‌ ‌ప్రధాన ఎడమ కాలువ కింద పిల్ల కాల్వ తీసేందుకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం ప్రధాన కాలువ వెంట మంత్రి కలియ తిరిగారు. మంత్రి వెంట టిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాక్రిష్ణశర్మ, మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్లు కాముని శ్రీనివాస్‌, ‌పాల సాయిరాం, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు సూరగోని రవిగౌడ్‌, ‌మండల ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply