Take a fresh look at your lifestyle.

ఒక్కరోజే 22 కొరోనా కేసులు..

  • తెలంగాణలో మొత్తం బాధితుల సంఖ్య..1038
  • కేసులు పెరగడంతో  అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష 

గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో ఈ రోజు పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు అప్రమత్తం చేశారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిదిలో కేసులు పెరుగకుండా చూడాలని ఆదేశించారు. సిఎం ఆదేశాలమేరకు చీఫ్‌ ‌సెక్రెటరీ సోమేష్‌ ‌కుమార్‌, ‌ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగా రావు, స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రెటరీ శాంత కుమారి, మున్సిపల్‌ , ‌వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌భేటీ అయ్యారు. సిఎం సూచనల మేరకు కంటైన్మెంట్‌ ‌ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్‌ ‌శాఖల సమన్వయంతో పని చేస్తున్నాయని సిఎంకి నివేదించినట్లు మంత్రి తెలియజేశారు.

ఈ రోజు 22 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు1038 కి చేరుకున్నాయి. మలకపెట్‌ ‌గంజ్‌లో పనిచేస్తున్న పహాడీ షరీఫ్‌, ‌జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్లో ముగ్గురు షాపుల యజమానులకు, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్‌ ‌వ్యాప్తి జరిగింది. వీరి కుటుంబాలన్నీటిని ఆసుపత్రిలో ఐసొలేషన్‌లో ఉంచాము. గంజ్‌, ‌పహదీశరీఫ్‌ ‌ప్రాంతాలను కంటైన్మెంట్‌ ‌ప్రాంతాలుగా ప్రకటించి తగు చర్యలు తీసుకుంటున్నారు.
ఈరోజు ముగ్గురు కరోనా మరియు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారు. వీరిలో ..
1 : 48(మేల్‌)‌సంవత్సరాల వయసుగల రామంతాపూర్‌కి చెందిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరిన 12 గంటల్లోనే చనిపోయారు. షుగర్‌, ‌బీపీ, స్థూలకాయం,న్యుమోనియాతో బాధపడుతూ చనిపోయారు.
2 : 76 సంవత్సరాల (మేల్‌) : ‌వనస్థలిపురం చెందిన వ్యక్తి , గుండె,కిడ్నీ,న్యూమోనియాతో బాధపడుతూ గాంధీలో చేరిన 24 గంటల్లోనే చనిపోయారు.
3 : 44 (ఫీమేల్‌) ‌సంవత్సరాల వయసుగల దుర్గానగర్‌, ‌జియగూడకి చెందిన వ్యక్తి నిన్న గాంధీ ఆసుపత్రికి వెంటిలేటర్‌ ‌మీదనే వచ్చారు. వచ్చిన గంటల్లోనే మరణించారు. ఈమె కూడా బీపీ, షుగర్‌, ‌న్యుమోనియాతో బాధ పడుతున్నారు.

ఈరోజు 33 మంది కరోనాకు పూర్తి చికిత్స తరువాత, పరీక్షలో రెండు నెగెటివే రిపోర్ట్ ‌రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 50 సంవత్సరాల వయసులగల డాక్టర్‌ ‌డిశ్చార్జ్ అయ్యారు. గాంధీలో 20 రోజుల క్రితం తీవ్ర మైన వ్యాధి లక్షణాలతో అడ్మిట్‌ అయ్యారు. హైడ్రోక్సి క్లోరోక్వీన్‌, అజిత్రో మైసిన్‌ ‌తదితర మందులు అందించి పూర్తిగా నయం చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చికిత్స, పేషంట్లకు అందిస్తున్న సౌకర్యాలపట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం సంతోషం అని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇక్కడ పర్యటిస్తున్న బృందం జరుగుతున్న పరీక్షల తీరు మీద, ల్యాబ్‌ ‌లు పనిచేస్తున్న విధానం పట్ల, చికిత్స పట్ల హోం శాఖ జాయింట్‌ ‌సెక్రెటరీ సలీల శ్రీవాత్సవ ప్రశంశలు కురిపించారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తు చ తప్పకుండా పాటిస్తున్నారని కేంద్ర బృందమే రిపోర్ట్ ‌పంపిన తరువాత రాజకీయ విమర్శలకు తావు లేదని మంత్రి అన్నారు.
గాంధీ, కింగ్‌ ‌కోటి, గచ్చి బౌలీ, ఫీవర్‌ ‌హాస్పిటల్స్, ‌లాబ్స్, ‌కంటేనమెంట్‌ ‌ప్రాంతాలు, సెంట్రల్‌ ‌డ్రగ్‌ ‌స్టోర్స్, ‌నైట్‌ ‌షెల్టర్‌ ‌లు విస్తుతంగా పర్యటించి అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తూ రిపోర్ట్ ‌పంపించారని మంత్రి తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!