Take a fresh look at your lifestyle.

దేశంలో కొరోనా మృతులు 206

  • దేశంలో 6,761 కరోనా పాజిటివ్‌ ‌కేసులు
  • 516 మంది కొరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్
  • ‌దేశంలో తగినన్ని ఔషధ నిల్వలు
  • దేశంలో ఎటువంటి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ లేదు
  • కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌

దేశంలో కొరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200 దాటింది. ఈ మేరకు ప్రభుత్వం వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 6,761 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదవగా వారిలో 206 మంది మరణించారని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ తెలిపింది. ఇంకా 6,039 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 516 మంది కొరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. కొరోనా వైరస్‌ ‌సంక్రమణ రేటు ఇండియాలో తక్కువగానే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. ఢిల్లీలో ఆయన డియాతో మాట్లాడుతూ.. గురువారం రోజున సుమారు 16002 కరోనా పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. దాంట్లో కేవలం 0.2 శాతం మాత్రమే పాజిటివ్‌ ‌కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. శ్యాంపిళ్లు సేకరించిన ఆధారంగా, ఇన్‌ఫెక్షన్‌ ‌రేటు పెద్దగా లేదని అగర్వాల్‌ ‌తెలిపారు. రాపిడ్‌ ‌డయాగ్నస్టిక్స్ ‌కిట్స్‌ను అందరికీ పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎటువంటి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ‌జరగలేదన్నారు. ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని తెలిపారు. కానీ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని అగర్వాల్‌ ‌తెలిపారు. భారత్‌లో కొరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ ‌సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 678 కొత్త కేసులు నిర్దారణ కాగా 33 మంది చనిపోయారు.

503 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఒక్కరోజే 16002 శాంపిల్స్ ‌టెస్ట్ ‌చేశాం. దేశంలో సరిపడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ‌టా•-లబెట్స్ ‌నిల్వలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. జనవరిలో మనకు ఉన్నది ఒకే ఒక్క ల్యాబ్‌. ‌ప్రస్తుతం దేశంలో 146 ప్రభుత్వ ల్యాబ్స్, 67 ‌ప్రైవేట్‌ ‌ల్యాబ్స్ అం‌దుబాటులో ఉన్నాయని’ లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. మనదేశంలో కావాల్సినంత హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ‌నిల్వలు ఉన్నట్లు కేంద్ర విదేశాంగశాఖ కోఆర్డినేటర్‌ ‌దమ్ము రవి తెలిపారు. చాలా వరకు దేశాలు ఆ డ్రగ్‌ ‌కావాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నాయని, కానీ మనకు కావాల్సినంత మన దగ్గర ఉంచుకుని, ఇతర దేశాలకు అవసరం మేరకు సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇండోపాక్‌, ఇం‌డోబంగ్లాదేశ్‌ ‌సరిహద్దుల్లో ఫెన్సింగ్‌ ‌లేని ప్రాంతాలు వద్ద బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు కేంద్ర •ంశాఖ సంయుక్త కార్యదర్శి సలిలా శ్రీవాత్సవ్‌ ‌తెలిపారు. ఈ నెలలో కొన్ని ఉత్సవాల దృష్టా లాక్‌డౌన్‌ ‌మార్గదర్శకాలను కచ్చితంగా నిర్దేశిరచాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర •ంశాఖ కోరింది. ఆయా నియమాలను కచ్చితంగా పాటించాలని కేంద్ర •ంశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీవాత్సవ ఆదేశించారు. వివిధ రాష్టాల్ర నుంచి అందిన సమాచారం ప్రకారం లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో దేశవ్యాప్తంగా వలస కూలీలు, అనాథల కోసం 37,978 శిబిరాలు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 34వేల కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతుండగా, 3,900కు పైగా కేంద్రాలను వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయని తెలిపారు. అదేవిధంగా 26,225 ఆహార కేంద్రాలు నడుస్తున్నాయని, వీటిద్వారా సుమారు కోటి మందికి ఆహారం అందిస్తున్నామని చెప్పారు. ఇందులో 14,799 ఆహార కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు, 11,426 కేంద్రాలను ఎన్‌జీవోలు నిర్వహిస్తున్నాయన్నారు. సుమారు 16.5 లక్షల కార్మికులకు వారు పనిచేసే కంపెనీలు, పరిశ్రమలు ఆశ్రయం కల్పించడంతోపాటు ఆహారాన్ని అందిస్తున్నాయని తెలిపారు.

Leave a Reply