Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొత్తగా 2,058 కరోనా కేసులు

కృష్ణా జిల్లాలో రెండు గ్రామాల్లో లాక్‌డౌన్‌
అమరావతి,జులై 31 : రాష్ట్రంలో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 23 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులు హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల చేశారు. ఏపీలో మొత్తం 19,66,175 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 13,377 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 2,053 మంది రికవరీ చెందారు. 21,180 యాక్టివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. మొత్తం 78,992 శాంపిల్స్ ‌సేకరించారు. మొత్తం 19,31,618 మంది రికవరీ చెందారు.

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడి దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీరులపాడు మండలంలోని దోడ్డదేవరపాడు, కొనతాలపల్లి గ్రామాలలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ఆయా గ్రామాలలో అధికారులు లాక్‌డౌన్‌ ‌విధించారు. వారం రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్‌ ‌డౌన్‌ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించా•

Leave a Reply