Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొత్తగా 2,043 కొరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గురువారం  రాత్రి 8గంటల వరకు 50,6344 కొరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,043 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.
నిన్న ఒక్కరోజే కొరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1016కి చేరింది. కొరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,802 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,35,357కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,081 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కొరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 23,79,950కి చేరింది.
In the State of Telangana, 10,4 Corona Diagnostic Tests We Chonduchted Tilpma On Thursdays and 1,01 Positive Chases We Registered.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply