Day September 25, 2024

రాజా హరిసింగ్‌ను అవ‌మానించేలా రాహుల్ వ్యాఖ్య‌లు

ప‌దేళ్ల‌లో క‌శ్మీర్ అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? దేశమంతా పాదయాత్ర చేసినా రాహుల్ కు తెలుసుకున్న‌ది శూన్యం మూడుసార్లు ఓడినా కాంగ్రెస్ లో మార్పు రాలేదు.. మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దేశమంతా రాహుల్ గాంధీ పాద‌యాత్ర చేసినా ఆయ‌న తెలుకుసున్న‌ది ఏమీలేద‌ని, ఇప్ప‌టికైనా రాహుల్.. చరిత్ర తెలుసుకోవాల‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై…

ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు…

రాజా హరిసింగ్‌ను అవ‌మానించేలా రాహుల్ వ్యాఖ్య‌లు ప‌దేళ్ల‌లో క‌శ్మీర్ అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? దేశమంతా పాదయాత్ర చేసినా రాహుల్ కు తెలుసుకున్న‌ది శూన్యం మూడుసార్లు ఓడినా కాంగ్రెస్ లో మార్పు రాలేదు.. మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశమంతా రాహుల్ గాంధీ పాద‌యాత్ర చేసినా ఆయ‌న తెలుకుసున్న‌ది ఏమీలేద‌ని, ఇప్ప‌టికైనా రాహుల్.. చరిత్ర తెలుసుకోవాల‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై రాజా హరిసింగ్ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ బహిరంగ చర్చకు రావాలని స‌వాల్ విసిరారు. జమ్మూ జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉంటున్నాయని, మహారాజా హరిసింగ్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నాను. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఓడించినా.. మీలో మార్పురాలేదు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినా.. దేశ చరిత్ర మీద, వాస్తవ పరిస్థితులపై కనీస అవగాహన కూడా రాలేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీలో డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ విలీనం సందర్భంగా విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. జమ్ము కాశ్మీర్ ప్రజల మనసు గెలిచి మహరాజా హరి సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి విషయంలో రాహుల్ మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. మహారాజా హరి సింగ్ పారిపోయాడని మాట్లాడటం హాస్యాస్పదమ‌ని, జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా ప్రతి ఇంట్లో మహారాజా హరిసింగ్ ఫోటో ఉంటుంద‌ని, అలాంటి మహనీయుడిని అవమానించడమంటే.. యావత్ డోగ్రా సమాజాన్ని జమ్మూకాశ్మీర్ ప్రజలను అవమానించడమే. లెఫ్టినెంట్ గవర్నర్ గురించి కూడా చాలా చులకనగా మాట్లాడారు. బయటినుంచి వచ్చిన వ్యక్తికి ఇక్కడ పెత్తనమేంటని అన్నారు. జమ్మూకశ్మీర్లో.. 1965లో గవర్నర్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత.. కరణ్ సింగ్ ను మినహాయిస్తే .. మిగిలిన వారందరూ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారే. దేశవ్యాప్తంగా కూడా ఇలాగే స్థానికేతరులే గవర్నర్లుగా ఉన్నారు. ఉంటారు కూడా.. గవర్నర్ వ్యవస్థను, లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థను మోదీనో , బీజేపీనో తీసుకురాలేదు. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ ఇలాగే కొనసాగుతోంది. దేశ చరిత్ర రాజకీయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాతే రాహుల్‌ బహిరంగ వేదికలమీద మాట్లాడాల‌ని కిష‌న్ రెడ్డి సూచించారు. పార్లమెంట్లో వివిధ చట్టాలపై చర్చ సందర్భంగా.. దేశ సైనికుల గురించి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడార‌ని మండిప‌డ్డారు. ఇతర దేశాల్లో మన దేశ వ్యవస్థలను అగౌరవపరుస్తూ మాట్లాడార‌ని, ఎన్నికల వ్యవస్థను, పార్లమెంటును, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచార‌ని, కులాలు,మతాలు, భాషల పేరుతో సమాజాన్ని విడదీసేలా మాట్లాడార‌ని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో 60 ఏళ్లలో మీరేం చేశారో.. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో ఏది పడితే అది మాట్లాడకుండా.. చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయంలో.. జమ్ము కాశ్మీర్లో శాంతి నెలకొల్పడంలో, ప్రతి పేదవాడికి ఇండ్ల నిర్మాణంతో పాటు ఇంటికి టాయిలెట్లు, గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలో.. ఐదులక్షల ఆరోగ్య బీమా, యువతకు, మహిళలకు చేయుత నందించడం.. వంటి ఎన్నో పనులు.. జమ్మూకశ్మీర్లో మోదీ ప్రభుత్వం చేసింద‌ని తెలిపారు. 2004-2014 మధ్యలో.. మీ పరిపాలనలో జమ్మూకశ్మీర్లో అశాంతి, అలజడి తప్ప మీరు సాధించిందేమీ లేదన్నారు. గతంలో ప్రతిపక్ష నేతలుగా పని చేసిన అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, సుష్మా స్వరాజ్, గులాంనబీ ఆజాద్ లాంటి వాళ్లు.. ప్రతిపక్ష నేతలుగా తమదైన ముద్రవేశారు. దేశ హితం లక్ష్యంగా పనిచేశారు. కానీ రాహుల్ గాంధీ ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే రీతిలో మాట్లాడితే చరిత్ర క్షమించదని కిష‌న్ రెడ్డిఅన్నారు. డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ నేత‌లు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీలో బీజేపీలో సభ్యులయ్యారని, ఇది ఏ ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదని, 140 కోట్ల దేశ ప్రజలందరికీ చెందిన‌ పార్టీలో చేరడంతో దేశం గర్వపడుతుంద‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు.

విధివిధానాలు రూపొందించ‌డి… పీఎంఏవై నుంచి గ‌రిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వ‌గృహ ఇళ్ల‌కు వేలం… ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటుకు విధివిధినాలు ఒక‌ట్రెండు రోజుల్లో రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.…

కాళేశ్వరం ప్రాజెక్టు అధికారుల‌పై క‌మిష‌న్‌ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

సమాధానాల‌ను దాట‌వేసిన అధికారులు ‌కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక క్రమశిక్షణా వైఫల్యంపై చీఫ్‌ అకౌంటెంట్‌ అధికారులను జస్టిస్‌ ‌పిసి ఘోష్‌ ‌కమిషన్‌ ‌ప్రశ్నించింది. పిసి ఘోష్‌ ‌కమిషన్‌ ‌ముందు చీఫ్‌ అకౌంట్స్ ఆఫీసర్‌ ‌వెంకట అప్పారావు, చీఫ్‌ అకౌంట్స్ ఆఫీసర్‌ ‌పద్మావతి, డైరెక్టర్‌ ఆఫ్‌ ‌వర్కస్ అకౌంట్‌ ‌చీఫ్‌ ‌ఫణిభూషణ్‌ ‌శర్మ హాజరయ్యారు. కాగ్‌ ‌నివేదిక గురించి…

ఇరాక్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులు

TPCC NRI Cell Convenor Manda Bhim Reddy, Indian Overseas Congress UK Vice President Varava Sudhakar Goud

నాలుగు నెలలుగా జీతాలు లేవు స్పందించిన ప్రజావాణి అధికారి దివ్యా దేవరాజన్ ఇరాక్ దేశంలోని బస్రా లో గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా కంపెనీ యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నదని ముగ్గురు బాధితుల పక్షాన వారి కుటుంబ సభ్యులు బుధవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితుల వెంట టీపీసీసీ ఎన్నారై…

చేసింది చెప్పుకోకనే ఓడిపోయాం..

KTR meeting

చిట్టినాయుడు ఉంటేనే.. కెసిఆర్‌ ‌విలువ తెలుస్తుంది స్టేషన్‌ ‌ఘనపూర్‌లో ఉప ఎన్నిక ఖాయం వరంగల్‌ ‌వెస్ట్ ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది.. చిట్టినాయుడు ఉంటేనే కదా కేసీఆర్‌ ‌విలువ తెలుస్తుంది… ఆడ బిడ్డలతో పెట్టుకుంటే రేవంత్‌ ‌రెడ్డి లగ్గం పక్కా చేస్తారు అంటూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌…

శంకర సముద్రం పునరావాస సమస్యలు ప‌రిష్క‌రిస్తాం

Uttam Kumar Reddy, Minister of Irrigation, Food and Civil Supplies

నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, జవహర్ నెట్టంపాడు, కోయిల్ సాగర్, గట్టు సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేసి ఉమ్మడి పాల‌మూరు జిల్లాకు సాగు నీరు అందిస్తామని నీటిపారుదల, ఆహార…

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం..

Palamuru Ranga Reddy lift scheme

12 లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తాం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేద‌ని, తాము మాత్రం ఈ శాసన సభ కాలంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం…

ప్రపంచంతో నే పోటీ ..

ఆ శక్తి తెలంగాణా యువతకు ఉంది.  ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు… విధివిధానాలు రూపొందించ‌డి… పీఎంఏవై నుంచి గ‌రిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వ‌గృహ ఇళ్ల‌కు వేలం… ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయి…

విద్యావ్యవస్థలో ప్రక్షాళన ఎలా..?

How to purge the education system..?

బహుళజాతి మందుల కంపెనీలు ఎనాడో మన వైద్య విధానాన్ని కబ్జా చేశాయి. మందులు వాళ్లే ఇస్తారు, రోగం వచ్చేట్టు వాళ్లే చేస్తారు. ఆ రోగం తగ్గేలా మందునూ వాళ్లే కనుగొంటారు. ఇదంతా కార్పొరేట్‌ ఆస్పత్రుల ముసుగులో జరుగుతున్న దోపిడీ. ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ కార్డులు జారీ చేసి-అటు ఆస్పత్రులకు, మందుల కంపెనీలకు, ఇటు నిరుపేద రోగికి మేలు…

You cannot copy content of this page