Take a fresh look at your lifestyle.

2023-24 ‌బడ్జెట్‌ ‌విశేషాలు

బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతరామన్‌
‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఐదవసారి కేంద్ర బడ్జెట్‌ 2023-24‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ‌ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రితోపాటు కేంద్ర మంత్రులు భగవత్‌ ‌కిషన్‌రావ్‌ ‌కరాద్‌, ‌పంకజ్‌ ‌చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేశంలో పెరిగిన డిజిటల్‌ ‌చెల్లింపులు : ఆర్‌బిఐ
ముంబై, ఫిబ్రవరి 1 : దేశంలో డిజిటల్‌ ‌చెల్లింపులు సెప్టెంబర్‌ 2022 ‌వరకు24.13 శాతం పెరిగినట్లు రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఆన్‌లైన్‌ ‌ట్రాన్సాక్షన్ల అడాప్షన్‌ ‌కోసం ఆర్బీఐ ప్రత్యేకంగా ఒక ఇండెక్స్ ‌ను తీసుకొచ్చింది. ఈ ఇండెక్స్ ‌సెప్టెంబర్‌ 2022 ‌నాటికి 377.46 కి చేరినట్లు ఆర్బీఐ పేర్కొంది. మార్చి 2022 చివర్లో ఈ ఇండెక్స్ 349.30 ‌వద్ద నిలిచినట్లు ఆర్బీఐ వివరించింది. పేమెంట్‌ ఎనేల్లర్స్, ‌పేమెంట్‌ ఇన్ఫాస్టక్చ్రర్‌, ‌పేమెంట్‌ ‌పర్ఫార్మెన్స్, ‌కన్జూ మర్‌ ‌సెంట్రిసిటీ అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్ ‌ను రూపొందించినట్లు రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా తెలిపింది.
మిల్లెట్స్ ‌ప్రోత్సాహానికి అన్నశ్రీ
బడ్జెట్‌లో మిల్లెట్స్ ఇన్‌స్టిట్యూట్‌ ‌ప్రతిపాదన
image.png
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : మిల్లెట్స్ ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో తృణ ధన్యాలకు ప్రౄదాన్యతను పెంచారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌బుధవారం పార్లమెంట్‌లో మిల్లెట్స్ ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో తృణధాన్యాలపై అవగాహన పెంచేందుకు మాత్రం చొరవ చూపారు. జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు. అరికలు, కొర్రలు వంటి మిల్లెట్స్ ‌దిగుబడిలో భారత్‌ ‌ముందువరసలో ఉండగా మిలలెట్స్‌లో భారత్‌ ‌రెండవ అతిపెద్ద ఎగుమతిదారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పేర్కొన్నారు. భారత్‌ ‌మిల్లెట్స్‌లో గ్లోబల్‌ ‌హబ్‌గా ఎదిగిందని, మిల్లెట్స్ ‌ప్రోత్సాహానికి ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ శ్రీ అన్న రీసెర్చ్ ‌తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ఇక మిల్లెట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే మిల్లెట్స్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహ నియంత్రణతో పాటు గ్లూటెన్‌తో వచ్చే అలర్జీలకు చెక్‌ ‌పెట్టడం, ఆస్త్మా, వాపులను నివారించడం, జీర్ణశక్తి మెరుగుదల, రోగనిరోధక శక్తి పెరగడం, హృద్రోగ ముప్పు నుంచి బయటపడటం వంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.పొగరాయుళ్లకు మరింత పొగ
కస్టమ్స్ ‌డ్యూటీ 16శాతంతో పెరగనున్న సిగరెట్ల ధరలు
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : పొగ రాయుళ్లకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌మరింత పొగగబెట్టారు. వారికి బ్యాడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పారు. సిగరెట్లపై కస్టమ్స్ ‌డ్యూటీ 16శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్రం నిర్ణయంతో పొగరాయుళ్లు సిగరెట్‌ ‌కోసం మరింత ఖర్చు చేయాల్సి రానుంది. సిగరెట్లపై కస్టమ్స్ ‌డ్యూటీని గత మూడేళ్లుగా పెంచలేదు. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్‌ ‌రేట్లు పెరగనున్నాయి. కస్టమ్స్ ‌డ్యూటీ పెంపు నిర్ణయంతో సిగరెట్‌ ‌తయారీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. గాడ్‌ ‌ఫ్రే ఫిలిప్స్ ‌షేర్లు 4.29శాతం క్షీణించగా.. గోడలెన్‌ ‌టొబాకో 3.81, ఎన్టీసీ ఇండస్ట్రీస్‌ 1.4, ఐటీసీ షేర్లు 0.78 శాతం మేర లాస్‌ అయ్యాయి.
బంగారంపై కస్టమ్స్ ‌డ్యూటీ పెంపు
మరింత ప్రియం కానున్న బంగారం ధరలు
డిజిటల్‌ ‌గోల్డ్‌గా మారిస్తే క్యాపిటల్‌ ‌గెయిన్‌ ‌పడదు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : బడ్జెట్‌లో ఎక్సైజ్‌ ‌సుంక పెరగడంతో బంగారం, వజ్రాల ధరలు పెరగనున్నాయి.  అయితే బంగారాన్ని డిజిటల్‌ ‌రూపంలోకి మార్చడం వల్ల లాభాలు ఉన్నాయి. ఒకవేళ మన దగ్గర ఉన్న బంగారం ఆభరణాలను డిజిటల్‌ ‌గోల్డ్‌గా మార్చాలని భావిస్తున్నారా.. అలా చేస్తే.. దాన్ని క్యాపిటల్‌ ‌గెయిన్స్‌గా పరిగణించరు. అలా మార్చిన బంగారం విలువపై పన్ను విధించరు. ఈ సంగతి స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించారు. బుధవారం ఆమె 2023-24 ఆర్థిక సంవత్సర బ్జడెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిజికల్‌ ‌గోల్డ్‌ను ఎలక్టాన్రిక్‌ ‌గోల్డ్‌గా మార్చుకుంటే దాన్ని ట్రాన్స్‌ఫర్‌గా గుర్తించరు. ఎటువంటి క్యాపిటల్‌ ‌గెయిన్స్ ‌పరిధిలోకి రాదు. దీన్ని ఎలక్టాన్రిక్‌ ఈక్విలెంట్‌ ‌గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ల ప్రోత్సాహంగా పరిగణిస్తారని చెప్పారు. బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై కస్టమ్స్ ‌డ్యూటీ 20 నుంచి 25 శాతానికి పెంచారు. తాజా సవరణలో సోషల్‌ ‌వెల్ఫేర్‌ ‌సర్‌చార్జి (ఎస్‌డబ్ల్యూఎస్‌) ‌తొలగించారు. ఇక అగ్రికల్చరల్‌ అం‌డ్‌ ఇన్‌‌ఫ్రాస్టక్చ్ర ‌సెస్‌ (ఏఐడీసీ) యథాతథంగా కొనసాగుతుంది. కస్టమ్స్ ‌డ్యూటీ పెంపు 2023 ఫిబ్రవరి రెండో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించారు. గతేడాది బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌.. ‌కట్‌ ‌లేదా పాలిష్డ్ ‌డైమండ్లపై దిగుమతి సుంకం 7.5 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించి వజ్రాల వ్యాపారులకు రిలీఫ్‌ ‌కల్పించారు. కానీ బంగారంపై దిగుమతి సుంకం యధాతథంగా కొనసాగించడం బులియన్‌ ‌మార్కెట్‌ ‌వర్గాలను నిరుత్సాహ పరిచింది. ఇదిలా ఉంటే ఇంతకుముందు అమల్లో ఉన్న బంగారం దిగుమతి సుంకం 10.75 నుంచి 15 శాతానికి పెంచుతూ గత జూలైలో కేంద్రం నిర్ణయం తీసుకున్నది. బంగారంపై బేసిక్‌ ‌కస్టమ్‌ ‌డ్యూటీ (బీసీడీ) 7.5 నుంచి 12.5 శాతానికి పెంచారు. ఏఐడీసీ యధాతథంగా 2.5 శాతంగా కొనసాగించారు.
ప్రత్యేక చీరకట్టులో నిర్మలా సీతారామన్‌
ఎరుపు రంగు టెంపుల్‌ ‌చీరలో వచ్చిన ఆర్థికమంత్రి

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ 2023-24 ‌కేంద్ర బడ్జెట్‌ను బుధవారం పార్లమెంటుకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె అత్యంత ఆకర్షణీయమైన, సంప్రదాయ వస్త్రాలు ధరించి, పార్లమెంటుకు హాజరయ్యారు. ఆమెకు భారతీయ సంప్రదాయ వస్త్రాలంటే చాలా ఇష్టమనే సంగతి అందరికీ తెలుసు. ఆమె సంప్రదాయబద్ధమైన టెంపుల్‌ ‌బోర్డర్‌ ఎరుపు రంగు చీరను ధరించి, పార్లమెంటుకు హాజరయ్యారు. టెంపుల్‌ ‌చీరలను సాధారణంగా నూలు, పట్టు లేదా ఈ రెండిటి మిశ్రమంతో తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుని ధరిస్తారు. నిర్మల ధరించిన చీరపై నల్లని రంగు బోర్డర్‌, ఇం‌ట్రికేట్‌ ‌గోడలెన్‌ ‌వర్క్ ‌ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదిలావుండగా, నిర్మల ప్రవేశపెడుతున్న ఐదో బడ్జెట్‌ ఇది. సాధారణ ప్రజానీకం ఆశలు, దేశ ఆర్థిక పరిస్థితుల మధ్య సమతుల్యతను పాటించడం ఆమెకు తీగపై నడవటం వంటిదేననడంలో సందేహం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ ‌బడ్జెట్‌పై చర్చను ప్రారంభించింది. కేబినెట్‌ ఈ ‌బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటుకు సమర్పించారు.
అపెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కర్నాటకకు పెద్దపీట
అప్పర్‌ ‌భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల కేటాయింపు
image.png
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌సాదాసీదాగా ఉందని వస్తున్న విమర్శల నేపథ్యంలో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు మాత్రం పెద్దపీట వేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకపై కరుణ చూపారు. నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల కోసం రూ.5,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ సాయం ప్రకటించారు. అప్పర్‌ ‌భద్ర ప్రాజెక్టుకు ఈ కేంద్ర సాయం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ‌కరువుతో కొట్టుమిట్టాడుతున్న మధ్య కర్ణాటక ప్రాంతాలను ఆదుకునేందుకు అప్పర్‌ ‌భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. తుంగ భద్ర నదిపై గల భద్ర రిజర్వాయర్‌ ‌నుంచి ప్రాజెక్టు లిప్ట్ ఇరిగేషన్‌ ‌కింద 17.40 టీఎంసీల నీటిని తరలించేందుకు అప్పర్‌ ‌భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది కర్ణాటక సర్కార్‌. ఏ‌ప్రిల్‌-‌మే మధ్య కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం బస్వరాజ్‌ ‌బొమ్మై సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ‌పార్టీ, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సారధ్యంలోని సెక్యులర్‌ ‌జనతాదళ్‌ (‌జేడీఎస్‌) ‌నుంచి అధికార బీజేపీ గట్టి పోటీని ఎదుర్కుంటున్నది. తమ సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర సాయం ప్రకటించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply