Take a fresh look at your lifestyle.

2022 ఆర్థిక రంగం ఆందోళనకరం .!.

దవ్యోల్బణం..
మార్కెట్‌ ‌కుతంత్రాలు…
సరఫరా సమస్యలు, కార్మికుల కొరత..
ప్రపంచ వాణిజ్యం..
ప్రయివేటు పెట్టుబడులు
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ : భారతదేశ ఆర్థిక ముఖ చిత్రం 2022లో ఎలా ఉండబోతున్నదన్న అంశంపై ఆర్ధిక విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు, ద్రవ్యోల్బణం, భయ ఆందోళనలు, సరఫరా సమస్యలు, కార్మికుల కొరత ఇవి దేశ ఆర్థిక రంగంలో ఆధిపత్యం చేయనున్నాయా..అన్న కోణంలో విశ్లేషణలు కొనసాగుతున్నాయి. వైరస్‌ ‌కొత్త వేరియంట్‌తో ప్రపంచం సతమతం అవుతున్నది. టీకా రంగంలో భారతదేశ పురోగతిని ప్రపంచం ప్రశంసించింది. ఇప్పుడు దేశ ఆర్థిక పరిధిని విస్తరించుకోవలసి వున్నది. పెట్టుబడి దారి విధానం ఒకవైపు..మరోవైపు ఓమిక్రాన్‌ ‌వైరస్‌ ‌తీసుకువస్తున్న ఆర్థిక పరమైన చిక్కులు నేడు దేశ ఆర్థిక చర్చలో అత్యధికంగా వినిపిస్తున్నాయి కనుక 2022లో ఆర్ధిక రంగంలో చోటు చేసుకునే ముఖ్యాంశాలలో ఏది ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందనేది గమనించాల్సిన అవసరం వుంది.

మొదటి కారణాన్ని పరిశీలిస్తే ద్రవ్యోల్బణం నేటి ఆర్థిక వ్యవస్థల్లో ప్రధాన సమస్యగా వుంది. ఇది రికార్డు స్థాయిలకు చేరుకుంది. ప్రపంచ వ్యాపిత సెంట్రల్‌ ‌బ్యాంకులు ద్రవ్యోల్బణం పెరుగుదలను అంచనా వేసినప్పటికీ, దీన్ని నిరంతర సమస్యగా కాకుండా ‘‘ట్రాన్సిటరీ’’గా అంచనా వేసాయి. ఇలా అంచనా వేయటం తగదు అని తెలిసి కూడా అంచనా వేసి కేంద్ర బ్యాంకులు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని సన్నాయి నొక్కులు నొక్కాయి. ఫెడరల్‌ ఓపెన్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ(ఎఫ్‌ఓఎమ్‌సి) సభ్యులు రేటు పెంపు అంచనాలతో ముందుకు వొచ్చారు. అనేక ఇతర దేశాలు ఇప్పటికే కఠినతరమయిన చర్యలు ఈ సమస్య మీద చేపట్టాయి. ఇదంతా చూస్తే, 2022లో ద్రవ్యోల్బణంను ట్రాక్‌ ‌చేయటం అనేది కీలక అంశం కానున్నదనేది స్పష్టం. ఊహించిన దానికంటే వేగంగా ఆర్థిక అస్థిరతకు దారి తీయించేలాగా ఈ సమస్య వుంది. ఇది ఆర్థిక వృద్ధి అవకాశాలను ప్రభావితం చేయనున్నది అనేది స్పష్టం.

రెండవ అంశం మార్కెట్‌ ‌కుతంత్రాలు. మార్కెట్‌లో ఒక ప్రణాళిక అంటూ ఏమి ఉండదు. ఎక్కువ లాభం ఆర్జించటం అనేదే ఇక్కడ మూల మంత్రం. మార్కెట్‌ ‌స్పెక్యులేటివ్‌గా నడిచేది. ఇక్కడ అసెట్‌ ‌వాల్యుయేషన్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఊహించిన దానికంటే వేగంగా పాలసీని నిలిపివేయడం, లేదా రికవరీ నిలిచిపోవడం లేదా కొత్త మార్పులు చోటు చేసుకోవటం వలన ఆర్థిక మార్కెట్‌లలో ప్రతికూల షాక్‌లు అస్థిరత పెరుగుదలకు దారితీయవచ్చు. డిసెంబర్‌లో మార్కెట్‌లు కొంత కరెక్షన్‌ను ఎదుర్కున్నాయి. ఇది 2022లో మరింత తీవ్రతరం కావచ్చు లేదా క్రాష్‌ ‌కూడా కావచ్చు. మార్కెట్‌లను ప్రమాదం అంచుకు నెట్టివేసే బహుళ ట్రిగ్గర్‌లు ఉన్నాయి. ఇవన్నీ ప్రతికూల పెట్టుబడి దారి సంపద పోగుపడటానికి ప్రభావాలు. ఈ ప్రభావం వినియోగం నిరంతరాయంగా తగ్గిపోవటం రూపంలో వ్యక్తమవుతూనే వున్నది.

మూడవ సమస్య సరఫరా సమస్యలు, కార్మికుల కొరత. అధిక ద్రవ్యోల్బణం కొనసాగడానికి ఒక కారణం సరఫరా అంతరాయాలు, కార్మికుల కొరత కూడా కారణం. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో పునఃప్రారంభం మొదలైన తర్వాత డిమాండ్‌ ‌పుంజుకోవడంతో పోలిస్తే సరఫరా ప్రతిస్పందన చాలా నెమ్మదిగా ఉంది. దీని వలన ధరలపై ఒత్తిడి పెరిగింది. అంతేకాకుండా, తాత్కాలిక అంతరాయాలు కూడా తోడు అయ్యాయి. (సూయజ్‌ ‌కెనాల్‌ ‌మూసివేయడం, లాస్‌ ఏం‌జిల్స్, ‌లాంగ్‌ ‌బీచ్‌ ఓడరేవులలో రద్దీ పెరగటం వంటివి) వీటి వలన కూడా డెలివరీ సమయాల్లో ఆలస్యం పెరిగింది. సెమీ-కండక్టర్‌ ‌కొరత వంటి సమస్యలు కూడా ఇటీవల కాలంలో స్వల్ప మెరుగుదల చూసినప్పటికీ సమస్యగానే కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా, దేశాలు కార్మికుల కొరతను ఎదుర్కున్నాయి..కార్మికులు శ్రామిక శక్తిని అమ్ముకోటానికి వైరస్‌ ‌వలన ఇప్పుడే తిరిగి రాలేని పరిస్థితికి చేరుకున్నారు. వైరస్‌ ‌లాక్‌ ‌డౌన్‌లో పరిశ్రమ చూపిన నిర్ధాక్షణ్యం తర్వాత కార్మికులు భయాందోళనలో కూరుకుపోయి వున్నారు. ఆకలితో సొంత గ్రామంలో జీవనం కొనసాగించడమా లేక పట్నంకి పోయి పరిశ్రమ చూపే నిర్ధాక్షణ్యతకి బలి కావడమా తేల్చుకోలేకపోతున్నారు. శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు బాగా పడిపోయింది. 2022లో ఈ అంతరాయాల పరిణామం వృద్ధి చెంది ద్రవ్యోల్బణ ప్రయాణాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

నాల్గవ అంశం ప్రపంచ వాణిజ్యం. 2021లో ప్రపంచ వాణిజ్యం బలంగా పుంజుకుంది, ఐఎమ్‌ఎఫ్‌ అం‌చనాల ప్రకారం ప్రపంచ వాణిజ్య వాల్యూమ్‌లు దాదాపు 10 శాతం పెరిగాయి. ఆర్థిక వ్యవస్థల్లో పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది. జనవరి-నవంబర్‌ 2021‌లో భారతదేశ ఎగుమతులు 41.9 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు సానుకూల ఆధారంగా పెరిగిన కమోడిటీ ధరలు, డిమాండ్‌ ‌పదునుగా పుంజుకోవడానికి సహాయపడే సానుకూలంగా ఉన్న ఆర్థిక/ద్రవ్య విధానాలు కారణంగా నిలిచాయి. ఈ కారకాలు ఉండకపోవడానికి లేదా 2022లో తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది ప్రపంచ వాణిజ్య వృద్ధిని తగ్గించనున్నది. దీని ప్రకారం, భారతదేశంలో విధాన పాలసీ నిర్ణేతలు వ్యాపార వ్యయాన్ని తగ్గించడానికి, దేశం ఎగుమతులను పెంచడానికి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ‌లకు మద్దతు ఇవ్వడానికి నిర్మాణాత్మక చర్యలపై దృష్టి పెడతారు.

ఐదవ అంశం ఇప్పటికే అమలులో ఉన్న ప్రకటనలు. భారత ప్రభుత్వం గత రెండు-మూడేళ్లుగా ప్రొడక్షన్‌ ‌లింక్డ్ ఇన్సెంటివ్‌(‌పిఎల్‌ఐ) ‌పథకం అమలు చేస్తున్నది. మల్టీ-మోడల్‌ ‌కనెక్టివిటీ కోసం గతి శక్తి, మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సహాయం చేయడానికి నేషనల్‌ ‌మానిటైజేషన్‌ ‌పైప్‌లైన్‌(ఎన్‌ఎం‌పి) వంటి అనేక చర్యలను ప్రభుత్వం ఈ సరికే ప్రకటించింది. ఈ చర్యలు ప్రయివేటు పెట్టుబడులను పెంచే అవకాశం ఉంది. ఐతే ఇది నిజమైన ఆర్థిక గ్రోత్‌ ఇవ్వడం యెంత కష్టమో మనకి తెలిసిందే.

ఆరవ అంశం ప్రైవేట్‌ ‌కాపెక్స్ ‌మరియు హౌసింగ్‌. ‌కొత్త ప్రాజెక్ట్ ‌ప్రకటనలు 2020-21లో అలాగే 2021-22 మొదటి అర్ధభాగంలో భారీ పతనానికి సాక్షంగా నిలిచి పెట్టుబడి పెట్టటానికి భయపడే పరిస్థితిలోకి ఇన్వెస్టర్లను నెట్టి ఈ రంగం చాలా భయంకరంగా తయారయింది. ప్రస్తుత కాలంలో కొత్త ప్రాజెక్ట్ ‌ప్రకటనలు మీడియం టర్మ్‌లో పెట్టుబడి అవసరం అనే డిమాండ్‌ ‌కీలకం కానుండటంతో ఇక్కడ ఆందోళనకర పరిస్థితి చోటు చేసుకుంది. అయితే, పిఎల్‌ఐ ‌స్కీమ్‌ల ద్వారా పునరుద్ధరణ చేసి హౌసింగ్‌ ‌విభాగంలో కావలసిన పిక్‌-అప్‌ ‌జరుగుతుందనే ఆశలు కొన్ని ఉన్నాయి. 2022లో దాదాపు ఏడు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు చూడనున్నాయి. ఈ ఎన్నికలలో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, ‌పంజాబ్‌ ‌గుజరాత్‌ల ఫలితాలు నిశితంగా పరిశీలించబడతాయి. అంతేకాకుండా, రాష్ట్రపతి ఎన్నిక కూడా 2022లో జరగనుంది. జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆర్థిక రంగంలో ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయి.

Leave a Reply