Take a fresh look at your lifestyle.

2019లో మోడీని.. ఇప్పు‌డు కేసీఆర్‌న .ఇంటికి పంపుదాం

– కొస్గీ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ

దేశంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్‌ ‌నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల కష్టాలు మరింత పెరిగాయని, ఇద్దరు నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ అన్నారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోని కేసీఆర్‌ ఇప్పు‌డు, 2019లో మోడీని ఓటు ద్వారా బుద్దిచెప్పి ఇంటికి పంపుదామని రాహుల్‌ ‌పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కొడంగల్‌ ‌నియోజకవర్గం కొస్గీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ ‌పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటుతో కష్టాలు తీరుతాయని ప్రజలు భావించారని అన్నారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కేసీఆర్‌ ‌వమ్ముచేశారని, ప్రతి యువకుడు నిరాశ, అసంతృప్తితో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణను 2లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి వ్యక్తిపై అప్పు ఉంటే .. కేసీఆర్‌ ‌కొడుకు ఆదాయం 4వందల రెట్లు పెరిగిందని విమర్శించారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy