రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వొస్తున్నది. తాజాగా బుధవారం ఒక్కరోజే కొరోనా కేసులు రెండు వేలు దాటాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 2055 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3,18,704కు చేరింది. కొరోనాతో బుధవారం ఏడుగురు మరణించారు.
దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,741కు చేరింది. బుధవారం 303 మంది వైరస్ నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారిసంఖ్య 3,03,601గా రికార్డయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,362 కేసులు యాక్టివ్గా ఉండగా.. వారిలో 8,263 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 87,332 కొరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1,06,59,953 మందికి కొరోనా పరీక్షలు చేశారు.