Take a fresh look at your lifestyle.

20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ

  • 2, 3 రోజుల్లో లాక్ డౌన్ 4.. వివరాలు 
  • ప్రధాని మోడీ ప్రసంగం లోని ముఖ్యాంశాలు 

ప్రపంచం మొత్తాన్ని 4 నెలలుగా అతలాకుతలం చేస్తున్న కొరోనా విపత్తును ఆత్మ విశ్వాసం తో నే ఎదుర్కోగలుగుతాం ..దాదాపు 2. లక్షల 75 వేల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారు ..మన దేశం లో కూడా మరణాలు సంభవించినాయి ..ప్రాణాలు కాపాడుకోవడం ఒక సవాలు గా మారిందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశిస్తూ మాట్లాడారు . ‘ఆత్మ నిర్భర్ భారత్ ‘ నినాదంతో ఆత్మా విశ్వాసం తో ఈ గడ్డు సమయాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

కొరోనా సంభవించినపుడు దేశంలో ఒక్క పిపిఈ కిట్లు లేదా శాస్త్రీయ మాస్క్ ల ఉత్పత్తి లేదని..కానీ ఆపద అవసరాన్ని గుర్తి చేసిందనీ ..ఈ రోజు 2 లక్షల పిపిఈ కిట్లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు .దేశం లోని అన్ని వర్గాలు కొరోనా విపత్తు తో నష్టపోయాయని ..అందుకోసం 20 లక్షల కోట్ల ప్యాకేజి ని ప్రకటిస్తున్నామని తెలిపారు . ఆర్ధిక ప్యాకేజి వివరాలు బుధవారం కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటిస్తారని ..మే 18 తో ముగుస్తున్న లాక్ డౌన్ ..ఆ తరువాత లాక్ డౌన్ 4 వివరాలను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.

 

Leave a Reply