Take a fresh look at your lifestyle.

20 ‌మంది మరణం.. 30 మంది గల్లంతు..?

ప్రజల జీవనానికి భరోసా ఇవ్వండి
ప్రభుత్వానికి ఓపిడీఆర్‌ ‌విజ్ఞప్తి

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ OPDRతెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రజల జీవన హక్కుకు భరోసా యివ్వండని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.20 మంది మరణించినట్టు.అందులో 3 చిన్నారులు..30 మంది గల్లంతయ్యారని పేర్కొంటూ..హైదరాబాద్‌ ‌లో 24 గంటలు నుంచి,  తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అతి భారీ  వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడై  13-10-2020 న కురిసిన వర్షం 33 సెంటీ మీటర్లు గా నమోదు అయింది. 100 సంవత్సరాల 2 వ అతి పెద్ద వర్షపాతం గా రికార్డు అయినదని నిపుణుల అభిప్రాయం.  ఇంకా 2, 3 రోజులు భారీగా వర్షాలు కురుస్తాయనే ఖచ్చితమైన అంచనా ఉంది.  హైదరాబాద్‌ ‌నగరం హిమాయత్‌ ‌సాగర్‌ 13 ‌గేటు అన్ని ఎత్తేయడంతో ప్రమాద స్థాయి ఏ స్థాయిలో వుందో అర్థం అవుతుంది.

హిమాయత్‌ ‌సాగర్‌ ‌చరిత్ర లో కూడా ఇదే ప్రధమం అని అధికారులు ప్రకటించారు. నగరంలో, తెలంగాణ అంతటా దాదాపు 10 మంది పైగా వరదల్లో చనిపోయినట్లుగా మీడియా వార్తలు వస్తున్నాయి.  తెలంగాణ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలి.  నివాస, గృహ వస్తు నష్టం కలిగిన కుటుంబాలను పూర్తి నష్ట పరిహారం ఇచ్చి  అందుకోవాలి. పేద ప్రజలందరికీ పునరావాసం కల్పించి,  ప్రతి కుటుంబానికి 1 నెల ఆహార వస్తువులు ఇవ్వాలి.  నష్ట పోయిన గృహోపకరణాల్లాంటివి ఉచితంగా వస్తు రూపంలో ఇవ్వాలి.  రాష్ట్రం అంతటా వరదల్లో చనిపోయిన వారి కుటుంబ వారసులకు ప్రతి వారికి కోటి రూపాయల నష పరిహారం వెంటనే ప్రకటించి చెల్లించాలి. గ్రామాలలో రైతులకు వ్యవసాయ, విత్తనాలు మరియు పంటల నష్ట పరిహారాలు  యుద్ద ప్రాతిపదికన చెల్లించాలి. ప్రకృతి విపత్తు గా తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రకటిస్తూ పూర్తి స్థాయిలో ప్రజలందరిని ఆదుకోవాలి..’ అని  అధ్యక్షులు లక్ష్మీ దేవి. .   ప్రధాన కార్యదర్శి నరసింహా ప్రకటనలో పేర్కొన్నారు.

మొబైల్‌, ఇం‌టర్నెట్‌ ‌సేవలకు అంతరాయం
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. గంటల తరబడి విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోవడంతో మొబైల్‌ ‌ఫోన్లు, ఇంటర్నెట్‌ అనుసంధానికి తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. మొబైల్‌ ‌ఫోన్‌ ‌టవర్లకు బ్యాటరీ పవర్‌ ‌బ్యాక్‌ ‌లేకపోవడంతో నగరంలోని నాల్గో వంతు టవర్లు నిలిచిపోయాయి. ఫలితంగా ఇంటర్నెట్‌, ‌మొబైల్‌ ‌సేవలు అందడం లేదు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply