మరో 15 మంది చనిపోయినట్లు నిర్ధారణ
రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలు నేపథ్యంలో కొరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయి..
మంగళవారం 2 వేల 493 కేసులు నమోదు అయినట్లు మీడియా బులెటిన్ లో పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో 15 మంది కొరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. మొత్తం 94 వేల 189 మందికి కొరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 2 వేల 493 మందికి కొరోనా సోకినట్లు నిర్దారణ అయింది.
రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 308 మంది కొరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా హాస్పిల్స్ నుండి డిశ్చార్జ్ కాగా 15 మంది కొరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 వేల 254 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కొరోనా మరణాల రేటు 1.2 శాతం ఉండగా తెలంగాణలో 0.56 శాతం నమోదు అయింది. అలాగే కొరోనా నుంచి కోలుకున్న వారి శాతం దేశ వ్యాప్తంగా 92.04 శాతం ఉండా తెలంగాణలో 93.70 శాతం నమోదు అయింది.