Take a fresh look at your lifestyle.

10‌న జాతీయ నులిపురుగు దినోత్సవం జిల్లాలో 2లక్షల 86వేల పిల్లలు లక్ష్యం: కలెక్టర్‌

‌నులిపురుగుల నిర్మూలన ఆల్బెండజోస్‌ ‌మాత్రలను 1-19 సంవ్సరాల లోపు వారందరికి తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల దినోత్సవంను పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్ ‌కమిటి సభ్యులతో నేషనల్‌ ‌డివార్మీంగ్‌డే విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో 2లక్షల 86వేల మంది పిల్లలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలల్లో, జూనియర్‌ ‌కళాశాలల్లో, ఒకేషనల్‌ ‌విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులు, టెక్నికల్‌ ‌సంస్థలు, కేంద్రీయ, నవోదయ కేంద్రాతో పాటు అంగన్‌వాడీల్లో గుర్తించిన వారందరికీ మాత్రలు వేయాలని ఆదేశించారు. ఈ నెల 30వ తేదీలోపు అన్ని పంపిణీ కేంద్రాలకు 3లక్షల ఆల్బెండజోన్‌ ‌ట్యాబెట్లను సరఫరా చేయడం జరుగుతుందని విద్యార్థులకు మాత్రల ప్రాముఖ్యతను వివరించి వారికి వేసే విధంగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

 

నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, మెడికల్‌, ‌విద్యాశాఖ అధికారులు, సిడిపివోలు, స్వయం సహాయక సంఘాలు, పిహెచ్‌సి సిబ్బంది, ఐకెపి, ప్రతి ఒక్కరు భాగస్వాములను చేసి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. గ్రామపంచాయితీ సర్పంచ్‌ల సహకారంతో గ్రామాల్లో ప్రచారం చేయించాలని డిపివోలను ఆదేశించారు. మాత్రలతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవని, ప్రజల్లో అవగాహన కల్పించి అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. సమన్వయంతో వ్యవహరించి జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ‌సూచించారు. జిడబ్ల్యుఎంసి కమిషనర్‌ ‌పమేలా సత్పతి, స్పెషల్‌ ‌కలెక్టర్‌ ‌మనుచౌదరి, డిఎంహెచ్‌వో డాక్టర్‌ ‌కె.లలితాదేవి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి గీతాలక్ష్మి, అడిషనల్‌ ‌డిఎంహెచ్‌వో డాక్టర్‌ ‌మదన్‌మోహన్‌, ఎం‌హెచ్‌వో రాజారెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి మహమూద్‌, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Asha Workers, Anganwadi Workers, Medical and School Officers, CDPs, Self Help Groups, PHC Staff, IKP

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!