తాజాగా కొరోనాతో మరో 10 మంది మృతి
గడిచిన 24 గంట్లలో తాజాగా 2,278 పాజిటివ్ కేసులు నమోదు కాగా… కొ రోనాతో 10 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. అలాగే వైరస్ బారిన పడి మొత్తం 950 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోలుకుని 1,21,925 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీలో 331, రంగారెడ్డిలో 187, మేడ్చల్లో 150 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 25,050 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లువైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కొరోనా మరణాల రేటు 0.61శాతం ఉండగా, దేశంలో 1.66 శాతంగా ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 78.7శాతంగా ఉందని, ఇది దేశ సగటు (77.75) కంటే ఎక్కువని పేర్కొంది. శుక్రవారం 62,234 శాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటికీ 20,78,695 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇంకా 2,027 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 55,989 మందికి టెస్టులు చేసినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 331 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డి 184, మేడ్చల్ మల్కాజ్గిరి 150, నల్గొండ 126, కరీంనగర్ 121, వరంగల్ అర్బన్ 91, ఖమ్మం 98 కేసులు రికార్డయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.