భద్రాచల పట్టణంలో శుక్రవారం నాడు గంజాయి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 9గంటలకు భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఎస్సై మహేష్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా ఏపి09 4891 అనే నెంబర్ గల ఈచర్ వ్యాను ను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించినట్లు తెలిపారు.ఈ తనిఖీల్లో కారు నందు 1415.100 కేజీల గంజాయి లభ్యమైనట్లు ఎస్పీ తెలిపారు.
దీని విలువ 2, 12, 26, 500/- రూపాయలు గా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న ముద్దా యిలను విచారించగా విశాఖ• •ట్నంకు చెందిన గన్నే రవి , మొత్రే ప్రకాష్, పప్పుల నాగేష్ వివరాలు సేకరించినట్లు తెలిపారు. హైదరా బాద్ కు చెందినరాజు , పవర్ బీర్బల్ (ఐచర్ ఓనర్ ) అని చెప్పి నట్లు తెలిపారు. భద్రాచల పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటైయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరియు మారేయితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని ఎస్పీ హెచ్చరిం చారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై మహస్త్రష్, ఎస్సై రామయ్య ఉన్నట్లు తెలిపారు.