- ఎక్కువమందికి వైరస్ సోకినా వేగంగా చికిత్స
- ఒకరికి పూర్తిగా నయం – రాష్ట్ర మంత్రి ఈటల రాజెందర్
- ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వివిధ వైద్యసంఘాలతో భేటీ
కొరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కట్టుదిట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు 209 కేసులు నమోదయ్యాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాలలో కొరోనా నిరోధించేందుకు అవగాహనా చర్యలు తీసుకుంటున్నారు. కగా తెలంగాణ రాష్ట్రం చాలా అప్రమత్తమయ్యింది. రాష్ట్రంలోని సరిహద్దుల్లో 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర దేశాలనుంచి వచ్చేవారినని గుర్తించి చికిత్స చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.కొత్తగా 6 కొరోనా ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కొత్తగా రెండుకేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కమాండ్ కంట్రో సెంటర్‌నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తెలంగాణలో నివసిస్తున్న వారిలో ఎవ్వరికీ కూడా వ్యాధి సోకలేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. శంషాబాద్‌లో 200 మంది ఆరోగ్యకార్యకర్తలు హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీ ప్రయాణీకుడిని పరీక్షిస్తున్నారు.వ్యాధి లక్షణాలున్న వారిని తరలించేందుకు 20 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు చాలావరకు జనం ఇంటికే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తెలంగాణ డాక్టర్లు నిర్విరామంగా రోగులకు చికిత్సనందిస్తున్నారు. వైద్య సిబ్బంది, డాక్టర్ల కోరిక మేరకు చికిత్సలో పాల్గొంటున్న వారందరికీ జౌ-95 మాస్కులను అందించింది. జీహెచ్ంఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో హైపోక్లోరైడ్ స్ప్రెయింగ్ చేపట్టారు.
ఒకేసారి ఐదువేలమందికి చికిత్స: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
ఒకేసారి, ఐదువేలమందికి చికిత్స చేసే విధంగా కావాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఎక్కువ మందికి వైరస్ సోకినా, అత్యవసరత పరిస్థితి ఏర్పడినా నిరోధించేందుకు ఆరోగ్యశాఖ పూర్తిగా సన్నద్ధంగా ఉన్నదని మంత్రి తెలిపారు.శుక్రవారం నాటికి 18 కొరొనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో ఒక వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని, డిశ్చార్జి చేశామని తెలిపారు. చికిత్స పొందుతున్న 17 మంది పరిస్థతి చాలా మెరుగుపడిందని వీరిలో కొందరిని రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని ఆయన తెలిపారు.కొరొనా వ్యాప్తి చేందకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), వివిధ వైద్య సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు, దవాఖానాలలోని డాక్టర్లు, ఇతర ఉద్యోగులు వ్యాధి సోకిన వారికి సేవాభావంతో చికిత్స చేసేందుకు శ్రద్ద తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఎవ్వరికీ వైరస్ లేదని ఆయన నిర్ధారించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వ్యాధిఉన్నదని, వారికి చికిత్సలు ఇస్తున్నామని పేర్కొన్నారు. కొరోనా వైరస్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలశ్రీతీ , ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే వ్యాధిని నిరోధించవచ్చునని ఈటెల తెలిపారు. లండన్‌నుంచి వచ్చిన వ్యక్తులకు పాజిటివ్ వచ్చిందని, వారిని వెంటనే క్వారంటైన్ చేసి చికిత్స మొదలుపెట్టామని తెలిపారు. ఎక్కువ మంది గుమ్మికూడకుండా ఉంటే చాలా తగ్గించవచ్చునని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విషయంలో ఆజాగ్రత్త చేయవద్దని విజ్ఞప్తి చేశారు. చాలా ప్రాంతాలలో మురికివాడలల్లో ఒకే గదిలో నలుగురుఐదుగురు కుటంబసభ్యులు జీవిస్తుంటారని, తమ ఇంటిలో చికిత్స చేసుకునే పరిస్థతి లేనివారందరినీ ఐసోలేషన్ చేసి చికిత్స ఇస్తామని ఈటెల పేర్కొన్నారు. నిరంతర అప్రమత్తత అవసరమని,జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 22వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలన్నింటినీ రద్దు చేయనున్న దృష్ట్యా విదేశాల నుంచి తెలంగాణకు ఎవ్వరూ వచ్చే అవకాశం ఉండదని తద్వారా వ్యాధి నివారణ చర్యలు వేగవంతమవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి వివరించారు.