Take a fresh look at your lifestyle.

143 ‌పురపాలక సంస్థల్లో 1,77,503 స్వయం సహాయక సంఘాలు

  • సభ్యులుగా18,02,284 మంది మహిళలు
  • పట్టణ ప్రగతి కింద 618 వెండింగ్‌ ‌జోన్లు అభివృద్ధి
  • పట్టణ పేదలు, వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి అండగా  రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ‌మార్చి 27 : అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే నిలయాలుగా తెలంగాణ నగరాలు, పట్టణాలు  గుర్తింపు తెచ్చుకున్నాయి. వైవిధ్యమైన విశిష్టమైన , సమ్మిళిత జీవన శైలి కలిగిన అర్బన్‌ ఏరియాలలో జీవిస్తున్న పేద కుటుంబాలు, వీధి వ్యాపారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. వారందరినీ సంఘటితం చేసి ఆర్థికంగా ఎదిగేందుకు ఇతోధికంగా చేయూత నందిస్తున్నది. లక్ష్యాలను మించి బ్యాంక్‌ ‌లింకెజి కల్పిస్తున్నది. కంటోన్మెంట్‌ ఏరియాతో కలిపి రాష్ట్రంలోని 143 పురపాలక సంస్థల్లో 1,77,503 స్వయం సహాయక సంఘాలలో 18,02,284 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 2021-22లో నిర్దేశంచబడిన రూ.1507 కోట్ల బ్యాంక్‌ ‌లింకేజికి మించి 33,324 సంఘాలకు రూ.2429 కోట్ల బ్యాంక్‌ ‌లింకేజీ కల్పించారు. 2022-23లో పేర్కొన్న రూ.1745 కోట్ల లక్ష్యానికి మించి మొత్తం 26,016 అర్బన్‌ ‌స్వయం సహాయక సంఘాలకు రూ.2083 కోట్ల బ్యాంక్‌ ‌లింకేజి కల్పించారు. పట్టణ ప్రగతి కింద వీధి వ్యాపారులను గుర్తించి ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తున్నది. పట్టణ ప్రగతిలో 618 వెండింగ్‌ ‌జొన్లను గుర్తించి 2676 షెడ్‌లను  ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో అర్బన్‌ ‌జనాభాలో 4.24 శాతం అంటే 6,22,476 మంది వీధి వ్యాపారులున్నట్లు గుర్తించి ంది. వీధి వ్యాపారులకు రుణాలు మంజూరులో రాష్ట్రం ముందున్నది.

1వ విడత రుణాలు (వీధి వ్యాపారికి ఏరూ.10,000/-) : రుణాల పంపిణీ లక్ష్యం  3,40,000  వీధి వ్యాపారుల కు మించి 3,51,467 (103 శాతం) రూ.351.46 కోట్లు పంపిణీ చేసి దేశంలో 1వ విడత రుణాల పంపిణీని 100 శాతం సాధించిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అందులో… 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాలు కేటగిరీలో, దేశంలో మొదటి 10 స్థానాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నగరాలు  : 1వ స్థానంలో సిరిసిల్ల, 2వ స్థానంలో సిద్దిపేట, నిర్మ ల్‌  3‌వ స్థానంలో, కామారెడ్డి 4వ స్థానంలో, బోధన్‌ 5‌వ స్థానంలో, జహీరాబాద్‌ 6‌వ స్థానంలో 7వ స్థానంలో మంచిర్యాల్‌, 8‌వ స్థానంలో పాల్వంచ, 9వ స్థానంలో సంగారెడ్డి, 10వ స్థానంలో ఆర్మూర్‌ ‌నిలిచాయి. అలాగే ప్రధాన పట్టణాలు, నగరాల విభాగంలో 1 నుండి 10 లక్షల మధ్య జనాభా కేటగిరీలో గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌  ‌దేశంలో 1వ స్థానంలో ఉంది, తర్వాత నిజామాబాద్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ 9‌వ స్థానంలో నిలిచింది. మెగా సిటీల విభాగంలో (• 40 లక్షల జనాభా)  జిహెచ్‌ఎం‌సి  దేశంలో 3వ స్థానంలో ఉంది. 2వ విడత రుణాలు(వీధి వ్యాపారికి ఏరూ.20,000/-) చొప్పున 1,21,672 వీధి వ్యాపారులకు రూ. 242.62 కోట్లు రుణాలు మంజూరు చేశారు. 2వ విడత కింద రుణాల పంపిణీలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలో 1వ స్థానంలో ఉంది. 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో, దేశంలోని మొదటి 10 స్థానాల్లో 09 నగరాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి :- 1వ స్థానంలో కామారెడ్డి, 2వ స్థానంలో సిరిసిల్ల, 3వ స్థానంలో నిర్మల్‌, 4‌వ స్థానంలో నిర్మల్‌, 5‌వ స్థానంలో సిద్దిపేట, 5వ స్థానంలో మంచిర్యాలిన్‌ 6‌వ స్థానంలో ఉన్నాయి., 7వ స్థానంలో కోరుట్ల, 8వ స్థానంలో సంగారెడ్డి, 9వ స్థానం ఆర్మూర్‌ ‌నిలిచింది.ప్రధాన నగరాల విభాగంలో (1 నుండి 10 లక్షల మధ్య జనాభా), జిడబ్ల్యుఎంసి దేశంలో 1వ స్థానంలో ఉంది, తర్వాత కరీంనగర్‌ 2‌వ స్థానంలో, నిజామాబాద్‌ 3‌వ స్థానంలో, రామగుండం  5వ స్థానం, ఖమ్మం 6వ స్థానంలో ఉన్నాయి. మెగా సిటీల విభాగంలో (• 40 లక్షల జనాభా), జిహెచ్‌ఎం‌సి దేశంలో 2వ స్థానంలో ఉంది.

వీధి వ్యాపారులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయుటకు 3వ విడత రుణాలు కింద (వీధి వ్యాపారికి ఏరూ.50,000/-)  లు చొప్పున 2,214   మందికి రుణాలు ఇప్పించారు. రుణాలు రకవరి, డిజిటల్‌ ‌చెల్లింపులలో కూడా వీధి వ్యాపారులు ముందున్నారు. డిజిటల్‌ ‌లావాదేవీలు  జరిపినందుకు దేశవ్యాప్తంగా ఉన్న వీధి వ్యాపారులకు లభించిన రూ 23 కోట్ల నగదు ప్రోత్సాహక ములో తెలంగాణలోని వీధి వ్యాపారులు రూ.4 కోట్ల 50 లక్షలు పొందారు. అలాగే దేశ వ్యాప్తంగా లభించిన మొత్తం వడ్డీ రాయితీ రూ 66 కోట్ల 56 లక్షల్లో తెలంగాణ రాష్ట్రంలోని వీధి వ్యాపారులు రూ.9 కోట్ల 26 లక్షలు పొందారు. స్థానిక వినియోగదారులకు, వీధి వ్యాపారులకు, వాహనాల రాకపోకలకు సౌకర్యంగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కింద మౌలిక సదుపాయాలతో 618  స్ట్రీట్‌ ‌వెండింగ్‌ ‌జోన్‌లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. అన్ని యుఎల్‌బి లలో పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ప్రాథమిక సౌకర్యాలను అందించడం ద్వారా వీధి విక్రయ మండలాల విభజన మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక భాగం. అభివృద్ధి కోసం గుర్తించిన వెండింగ్‌ ‌జోన్ల సంఖ్య పట్టణ ప్రగతి కార్యక్రమం కింద : 618, స్ట్రీట్‌ ‌వెండింగ్‌ ‌జొన్లలో మొత్తం 2676  షెడ్‌ ‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 1294 షెడ్‌ ‌ల నిర్మాణం పూర్తయి, వినియోగంలోకి వచ్చాయి. మరో  1382 షెడ్‌ ‌ల పనులు పురోగతిలో వున్నవి.

స్వయం ఉపాధి కార్యక్రమం కింద స్వయం సహాయక సంఘాలచే పురపాలికల్లో రూ.140 కోట్లతో 15,674  సూక్ష్మ పరిశ్రమల యూనిట్లు ఏర్పాటు చేశారు. 2022-23లో రూ.16 కోట్ల 20 లక్షలతో 1584 యూనిట్లు నెలకొల్పారు. కోవిడ్‌ ‌సమయంలో 66,265 స్వయం సహాయక సంఘాలకు రూ.37 కోట్ల 23 లక్ష లను క్రెడిట్‌ ‌సపోర్ట్‌గా అందించారు. స్కిల్స్ ‌ట్రైనింగ్‌, ‌ప్లేస్‌మెంట్‌ ‌ద్వారా ఉపాధి(ఇఎస్‌టి • పి) : ఇప్పటి వరకు 37,512 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు, వారిలో 17,233 మంది అభ్యర్థులు ప్లేస్మెంట్‌ ‌పొందారు.

Leave a Reply