Take a fresh look at your lifestyle.

ఎపిలో కొత్తగా 17,354 పాజిటివ్‌ ‌కేసులు, తాజాగా మరో 64 మంది మృతి

ఆం‌ధప్రదేశ్‌లో కొరోనా కల్లోలం సృష్టిస్తోంది.. సెకండ్‌ ‌వేవ్‌ ‌మొదలైన తర్వాత క్రమంగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ ‌కుమార్‌ ‌సింఘాల్‌ ‌వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో ఏపీలో 17,354 కొత్త పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా.. 64 మంది మృతి చెందారు. దీంతో.. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 10,98,795కు చేరుకోగా.. ఇప్పటి వరకు 9,67,823 మంది డిశ్చార్జ్ అయ్యారు.. 7,992 మంది కోవిడ్‌ ‌బారినపడి మృతిచెందగా.. ప్రస్తుతం 1,22,980 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది వైరస్‌ ‌బారినపడిన వారిలో 8468 మంది కోలుకున్నారు. 64 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 11,01,690కి పెరిగాయి. 9,70,718 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ ‌కేసులు 1,22,980 చేరాయి. ఇప్పటి వరకు 7992 మంది మృతి చెందారు. 24 గంటల వ్యధవధిలో 86,494 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక, ప్రైవేట్‌ హాస్పిటల్స్ల కు 15294 రెమిడెసివిర్‌ ఇం‌జెక్షన్లు ఇచ్చినట్టు అనిల్‌ ‌కుమార్‌ ‌సింఘాల్‌ ‌తెలిపారు. 437 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ‌సరఫరా చేశామని.. ఆక్సిజన్‌ ‌సరఫరాను మరింత పెంచాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు..

ఏపీకి రెండు ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయి.. క్రయోజనిక్‌ ‌ట్యాంకర్లు అందుబాటులో ఉంటే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. శ్రీ సిటీలో క్రయోజనిక్‌ ‌ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్టు సమాచారం ఉందన్న ఆయన.. కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లు కొత్తవి ప్రారంభిస్తున్నాం.. 7749 మంది కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లల్లో ఉన్నారని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 15 వేలకు చేరొచ్చుఅని అంచనా వేశారు.

Leave a Reply