Take a fresh look at your lifestyle.

కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికకు 172 ఏళ్ళు

“మార్క్స్, ఎం‌గెల్స్‌ చరిత్రకు ఏ బాకీ పడ్డారో, మార్క్స్ అనంతరం ఎంగెల్స్ ‌కూడా ఆ బాకీ చెల్లింపుకు సిద్ధపడలేదో, చరిత్రకు అట్టి బాకీని తర్వాత కాలంలో లెనిన్‌ ‌చెల్లించాడు. అందుకోసం మార్క్స్, ఎం‌గెల్స్ ‌ల అనుచరుల పేరిట ఎందరో నేతలు లెనిన్‌ ‌పై బండెడు బురద చల్లారు. క.పా.ప్ర. మౌలిక సూత్రాల నుండి లెనిన్‌ ‌వైదొలుగుతున్నాడంటూ లెనిన్‌ ‌పై రాజకీయ నిందా ప్రచారం జోరుగా సాగింది. ప్రధానంగా మార్క్స్, ఎం‌గెల్స్ ‌ల అనంతర కాలంలో వచ్చిన మార్పుల్ని మార్క్సిస్ట్ ‌దృక్కోణంతోవిశ్లేషించి ’’యుగ స్వభావం’’ లో మార్పు వచ్చిందని నిర్ధారణ చేసాడు. ముఖ్యంగా ’’పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ సామ్రాజ్యవాదం’’ గ్రంథ రచన ద్వారా నిరూపించాడు. దానితో మార్క్స్, ఎం‌గెల్స్ ‌ల క.పా.ప్ర.కి లెనిన్‌ ‌విరుద్ధంగా వెళ్తున్నాడని కాట్స్కీ నుండి ట్రాటెస్కీ వరకు దుమ్మెత్తి పోశారు. ఐనా మార్క్స్, ఎం‌గెల్స్ ‌ల మౌలిక సూత్రాల పక్షాన దృఢంగా నిలిచిన మార్క్సిస్టు మహోపాధ్యాయునిగా లెనిన్‌ ‌చరిత్రలో నిలిచాడు.”

*చరిత్రకు మార్క్స్, ఎంగెల్స్ పడ్డ బాకీ చెల్లించి ప్రణాళికను సంపద్వంతం చేసిన లెనిన్*

మార్క్స్, ఎం‌గెల్స్‌ చరిత్రకు ఏ బాకీ పడ్డారో, మార్క్స్ అనంతరం ఎంగెల్స్ ‌కూడా ఆ బాకీ చెల్లింపుకు సిద్ధపడలేదో, చరిత్రకు అట్టి బాకీని

*మార్క్స్, ఎంగెల్స్* రచించిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక (క.పా.ప్ర.) ను ఆమోదించి నేటికి 172 ఏళ్లు! అందులో చెప్పిన కొన్ని అంశాలు వాళ్లిద్దరి జీవిత కాలంలోనే మార్పుకు గురయ్యాయి. ఐతే వారు ప్రణాళికలో మార్పులు చేయడం ద్వారా కాదు. ప్రణాళికలోని కొన్ని విషయాలు ప్రాసంగీకత కోల్పోయిన లేదా కోల్పోతున్న ప్రస్తావన చేశారు. మార్క్స్, ఎంగెల్స్ లు రచించిన ప్రణాళికను తాజా పరచాల్సిన ప్రక్రియ గూర్చి తొలుత ప్రస్తావన చేసింది కూడా స్వయంగా మార్క్స్, ఎంగెల్స్ లే! ఆ ప్రక్రియను పరిపూర్తి చేసిన రాజకీయ ఘనత లెనిన్ ది.

*క.పా.ప్ర.* ఆమోదం తర్వాత పాతికేళ్ల కు మరో జర్మన్ ముద్రణకు ముందుమాటలో ” *గత ఇరవైఐదు ఏళ్ళల్లో పరిస్థితులు ఎంతగానో మారాయి. ఐనప్పటికీ, ప్రణాళికలో చెప్పిన సాధారణసూత్రాలు, మొత్తం మీద, ఎప్పటిలాగే ఇప్పటికీ సరిగ్గానే ఉన్నాయి. కాకుంటే అక్కడక్కడా కొన్ని వివరాల్ని మెరుగుపర్చవచ్చు. ఆచరణలో యీ సూత్రాల్ని అమలు చేయడమనేది ఎప్పుడైనా, ఎక్కడైనా ఆనాడున్న చారిత్రిక పరిస్థితుల్ని బట్టి వుంటుంది”* అని మార్క్స్ ఎంగెల్స్ వ్యాఖ్యానించారు.

*పై ముందుమాటలోనే ప్రణాళిక లోని రెండో అధ్యాయం గూర్చి మార్క్స్, ఎంగెల్స్ చేసిన మరో వ్యాఖ్యానం చూద్దాం. ” *1848 నుండి ఇవాళ్టి వరకూ ఆధునిక పరిశ్రమ బ్రహ్మాండంగా పురోగమించింది. దానితో పాటు కార్మికోద్యమం ఆచరణాత్మకమైన అనుభవాన్ని పొందింది. మొదట ఫిబ్రవరి విప్లవంలోనూ, అంతకంటే మించి ఆ తర్వాత వచ్చిన పారిస్ కమ్యూన్ లో అది గడించింది. పారిస్ కమ్యూన్ లో మొదటిసారి శ్రామికవర్గం పూర్తిగా రెండు నెలల పాటు రాజకీయాధికారాన్ని కలిగి వుంది. దానివల్ల కార్మికవర్గ నిర్మాణం మెరుగయ్యింది, విస్తరించింది. ఈ కారణాలన్నింటి వల్ల ఈ కార్యక్రమంలో కొన్ని అంశాలకు కాలం చెల్లింది* ” అని వ్యాఖ్యానం చేయడం గమనార్హం!

*పై వివరణ ఇస్తూ, ఉదాహరణగా మార్క్స్, ఎంగెల్స్ ఇచ్చిన కింది ఏకవాక్య నిర్ధారణ చూద్దాం ”

” *పారిస్ కమ్యూన్ ప్రత్యేకంగా ఒక విషయాన్ని రుజువు చేసింది. అది ఏమంటే *”కార్మికవర్గ0 తన లక్ష్యాల కై అప్పటికి సిద్ధంగా ఉన్న రాజ్యాంగ యంత్రా0గాన్ని యధాతధంగా ఉపయోగించుకోలేదు”* *

- Advertisement -

*పై* ముందుమాటని నాలుగు చిన్న వాక్యాలతో కూడిన ఈ క్రింది పేరాతో మార్క్స్, ఎంగెల్స్ లు ముగించారు. (ఆ పేరాలో వాక్యాలకు అంకెలు లేవు. కానీ వాటిపై నా సులభ భాష్యంకై 1,2,3,4 అంకెల వారీగా చేర్చా. కింద ఉటంకిస్తున్నా)

*1*”ఐతే, ఈ ప్రణాళిక ఒక చారిత్రిక పత్రం అయ్యుంది.
*2*-దానిని మార్చే హక్కు మాకు ఏ మాత్రం లేదు.
*3*-1847 నుండి ఇవ్వాల్టి వరకు జరిగిన పరిణామాలను సమీక్షించే ముందుమాటతో మరో ముద్రణ వస్తే రావచ్చు.
**4**ఇప్పుడు అనుకోకుండా వచ్చిన పునర్ముద్రణ లో అట్టి ముందుమాట రాయడానికి సరిపడే వ్యవధి లేదు”.

* పైన ఉదహరించిన నాలుగు వాక్యాలతో కూడిన పేరా విశిష్టతని చెప్పడమే ఈ వ్యాస ప్రధాన లక్ష్యం!
*1* ప్రకారం అది *”చారిత్రిక పత్రం”*
*2* ప్రకారం దాన్ని మార్చే హక్కు తమకు లేదు.
*3* ప్రకారం నిరంతరం మారుతున్న భౌతిక పరిస్థితులకు అనుగుణ్యంగా ఒక “ముందుమాట” ని ప్రత్యేకంగా రాయాల్సి ఉంది. అది చారిత్రికంగా ఓ బాధ్యతగా మార్క్స్, ఎంగెల్స్ లు ప్రగాఢంగా భావించారు. అంటే వాళ్లిద్దరూ చరిత్రకు బాకీ పడ్డారు. 4 ప్రకారం వారికప్పుడు ఆ బాకీచెల్లింపుకి అవకాశం చిక్కలేదు. ఫలితంగా చరిత్రకు ఋణపడ్డారు. ఆ తర్వాత పదేళ్లకు బాకీ చెల్లించే అవకాశం వారికి లభించింది. అదే 1882 రష్యన్ ముద్రణకు వాళ్లిద్దరూ రాసిన “ముందుమాట”! కానీ చరిత్ర కు మళ్లీ బకాయిని కొనసాగించారు.

ఇంతలో మార్క్స్ 1883లో మరణించాడు. ఆయన మరణం తర్వాత ఎంగెల్స్ ఇక దాని గూర్చి ఆలోచించే సాహసం కూడా చేయ లేదు. ఇద్దరు కలిసి చరిత్రకు చేసిన రుణభారాన్ని తానొక్కణ్ణే తీర్చడం సాద్యం కాదనుకున్నాడో ఏమో మరి! అదే మాట 1883 నాటి మరో జర్మన్ పునర్ముద్రణకి ముందుమాట లో ఎంగెల్స్ చెప్పకనే చెప్పాడు. ఆ వాక్యాలను కూడా ఈ కింద ఉదహరిస్తున్నా.

” *ప్రణాళికలో మార్పులూ, చేర్పులూ చేసే ఆలోచన ఆయన (మార్క్స్ అని) ఉన్నప్పుడే లేదు. ఇక ఆయన చనిపోయాక అట్టి అవకాశం అసలే లేదు* ”

*మార్క్స్, ఎంగెల్స్* చరిత్రకు ఏ బాకీ పడ్డారో, మార్క్స్ అనంతరం ఎంగెల్స్ కూడా ఆ బాకీ చెల్లింపుకు సిద్ధపడలేదో, చరిత్రకు అట్టి బాకీని తర్వాతకాలంలో లెనిన్ చెల్లించాడు. అందుకోసం మార్క్స్, ఎంగెల్స్ ల అనుచరుల పేరిట ఎందరో నేతలు లెనిన్ పై బండెడు బురద చల్లారు. క.పా.ప్ర. మౌలిక సూత్రాల నుండి లెనిన్ వైదొలుగుతున్నాడంటూ లెనిన్ పై రాజకీయ నిందా ప్రచారం జోరుగా సాగింది. ప్రధానంగా మార్క్స్, ఎంగెల్స్ ల అనంతర కాలంలో వచ్చిన మార్పుల్ని మార్క్సిస్ట్ దృక్కోణంతో విశ్లేషి0చి *”యుగ స్వభావం”* లో మార్పు వచ్చిందని నిర్ధారణ చేసాడు. ముఖ్యంగా *”పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ సామ్రాజ్యవాదం”* గ్రంథ రచన ద్వారా నిరూపించాడు. దానితో మార్క్స్, ఎంగెల్స్ ల క.పా.ప్ర.కి లెనిన్ విరుద్ధంగా వెళ్తున్నాడని కాట్స్కీ నుండి ట్రాటెస్కీ వరకు దుమ్మెత్తి పోశారు. ఐనా మార్క్స్, ఎంగెల్స్ ల మౌలిక సూత్రాల పక్షాన దృఢంగా నిలిచిన మార్క్సిస్టు మహోపాధ్యాయునిగా లెనిన్ చరిత్రలో నిలిచాడు. పైగా 1882 రష్యా ముద్రణకు ముందుమాటలో *”యూరోప్ లో విప్లవ కార్యాచరణకు ఇప్పుడు రష్యా అగ్రగామిగా వుంది”* అనే చారిత్రిక జోస్యాన్ని మార్క్స్, ఎంగెల్స్ లు చెప్పారు. నిజానికి అది క.పా.ప్ర. ఆవిష్కరణ నాటికి వారి అవగాహన కు భిన్నమైనది. పశ్చిమ యూరోప్, ముఖ్యంగా ఇంగ్లాండ్ తొలి సోషలిస్టు విప్లవకేంద్రంగా వుంటుందనేది వారి నాటి అంచనా! నాటికి వారి దృష్టిలో రష్యా లేదు. ఇది భిన్నమైన చారిత్రిక జోస్యం! రష్యాలో సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేయడం ద్వారా ఆ జోస్యాన్ని లెనిన్ నిరూపించాడు.

*అందుకే* చరిత్రకు వైతాళిక సిద్ధాంత సూత్రాల్ని కనుగొన్న మార్క్స్, ఎంగెల్స్ లతో పాటు, వాటిని తాజాపరిచి, మార్క్స్, ఎంగెల్స్ లు తీర్చకుండా వదిలేసిన చారిత్రిక బాకీని చెల్లించిన లెనిన్ కూడా క.పా.ప్ర. లో భాగస్వామియే!
లెనిన్ కూడా మార్క్స్, ఎంగెల్స్ రచించిన క.పా.ప్ర. ను మార్చలేదు. ప్రపంచ శ్రామికవర్గ విప్లవయానం లో శ్రామికవర్గానికి ఓ దిక్సూచి గా క.పా.ప్ర. ను మార్క్స్, ఎంగెల్స్ లు అందించారు. ఔను, ముమ్మాటికీ సరైన మార్గంలో విప్లవం ద్వారా విముక్తిని సాధించడంలో అదో సైద్ధాంతిక దిక్సూచి! దాన్ని కొలిమి లో పోత పోసి, అచ్చు మార్చే పనికి లెనిన్ పూనుకున్నది లేదు. కానీ మార్క్స్, ఎంగెల్స్ కాలంలో నాటి యుగస్వభావాన్ని బట్టి పడమర దిక్కుకు సాగించే ప్రయాణంలో అదో దిక్సూచి! లెనిన్ కాలంలో యుగ స్వభావం మారడంతో తూర్పుకు బదులు పడమర దిశలో విముక్తికై ప్రయాణం సాగాల్సి వచ్చింది. అదే దిక్సూచి మారకుండానే, దానిని కొత్త దిశలో వినియోగించే విధానాన్ని లెనిన్ ఆవిష్కరించాడు. అందుకే నేడు క.పా.ప్ర. పునరావిష్కరణ సందర్భంగా మార్క్స్, ఎంగెల్స్ లతో పాటు లెనిన్ ని కూడా పునర్దర్శనం చేసుకుందాం. క.పా. ప్రణాళిక నాటి భౌతిక పరిస్థితులు మార్పులకు గురైనప్పుడు అందుకనుగుణంగా విశ్లేషణ చేసి, తాజాపరచడం ద్వారా లెనిన్ చేసిన పొలిటికల్ కాంట్రిబ్యూషన్ యుగ ప్రాధాన్యత గలది. అందుకే క.పా. ప్రణాళిక ఆవిష్కర్తలైన మార్క్స్, ఎంగెల్స్ లతో పాటు లెనిన్ నుండి కూడా విప్లవ స్ఫూర్తి పొందుదాం.

*ఇఫ్టూ ప్రసాద్* (పిపి)
21-2-2020

Leave a Reply