Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొత్తగా1,718 మందికి పాజిటివ్‌

‌రాష్ట్రంలో  కొరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. శుక్రవారం రాత్రికి 24 గంటల్లో కొత్తగా 1,718 పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోనే 285 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,97,327 మందికి పాజిటివ్‌గా నిర్దారణ కాగా, వైరస్‌ ‌ప్రభావంతో 24 గంటల్లో 8 మంది మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1,153కు చేరింది.

24 గంటల్లో 2,002 మంది చికిత్సకు కోలుకొని ఇండ్లకు వెళ్లగా ఇప్పటి వరకు మొత్తం 1,67,846 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 28,328 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా.. హోం ఐసోలేషన్‌లో 23,224 మంది ఉన్నారు. రాష్ట్రంలో కొరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 85.05గా ఉంది. 24 గంటల్లో రాష్ట్రంలో 49,084 మందికి కొరోనా నిర్దారణ పరీక్షలు చేయగా మొత్తం 31,53,626 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply