Take a fresh look at your lifestyle.

17‌శాతం వృద్ధిని సాధించాం

ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు
కేంద్రం ఒక్కపైసా ఇవ్వకపోయినాఅభివృద్ధి ఆగలేదు
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో బీపీవో సంస్థలు
అసెంబ్లీలో ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌
గడిచిన ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేశామని ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికిపైగా పెరిగి లక్షా 10వేల కోట్ల రూపాయాలకు చేరుకోవడం తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనమన్నారు. వచ్చే నెలలో కరీంనగర్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించబోతున్నామని, రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్‌లో కూడా ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. యూపీఏ పదవీకాలం ముగుస్తున్న సమయంలో ఐటీఐఆర్‌(ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌రీజియన్‌) ‌పాలసీని తీసుకువచ్చిందని, ఐటీఐఆర్‌ ‌పాలసీ కింద యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఐటీఐఆర్‌ ‌కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేంద్రానికి దాదాపు పదిసార్లు నేరుగా కలిసి అడిగామని, లేఖలు రాశామని అన్నారు. నాటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వనందుకే ఐటీఐఆర్‌ ఇవ్వలేదని మాట్లాడారని కేటీఆర్‌ ‌గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలను ఆ మరుసటి రోజే దత్తాత్రేయకు చూపించామని, మా పాలసీ ఐటీఐఆర్‌ ‌కాదు.. దాన్ని ముందుకు తీసుకెళ్లమని నాటి కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌స్పష్టం చేశారన్నారు. బెంగళూరుకు, హైదరాబాద్‌కు మంజూరు చేశారు కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. వారు ఇవ్వకపోయినంతా మాత్రాన ఐటీ అభివృద్ధి ఆగలేదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలతో తెలంగాణలో 17శాతం వృద్ధిని ఐటీ రంగంలో సాధించామని కేటీఆర్‌ ‌తెలిపారు. ఉత్తర, దక్షిణ హైదరాబాద్‌లో కూడా ఐటీని ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌నలువైపులా ఐటీ కంపెనీలను విస్తరిస్తామని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. కరీనంగర్‌లో రాబోయే నెలలో ఐటీ టవర్‌ను ప్రారంభించబోతున్నామని, మహబూబ్‌నగర్‌ ఐటీ టవర్‌కు టెండర్‌ ‌పూర్తయింది. 50 ఎకరాల స్థల సేకరణ జరిగింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయని మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీలో స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో చెత్త సేకరణ మెరుగ్గా ఉంది దేశంలోని ప్రముఖ నగరాలతో పోల్చుకుంటే చెత్త సేకరణలో, మురుగునీటి శుద్దీకరణలో హైదరాబాద్‌ ‌మెరుగ్గా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీహెచ్‌ఎం‌సీలో మురుగునీటి శుద్ధి కేంద్రాల సామర్థ్యం పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం ఇచ్చారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాల సామర్థ్యం పెంచుతున్నామని పేర్కొన్నారు. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చెత్త సేకరణ, మురుగునీటి శుద్ధీకరణ మెరుగ్గా ఉన్నామని, ఢిల్లీ, ముంబయి నగరాల కంటే మనం మెరుగ్గా ఉన్నామన్నారు. మరింత మెరుగ్గా పనిచేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ కోసం 21 ప్లాంట్లు పని చేస్తున్నాయని తెలిపారు. 2021 వరకు వీటిని రెట్టింపు చేస్తామన్నారు. హైదరాబాద్‌ 54‌శాతం డ్రైనేజీ నీరు మూసీ నదిలో కలుస్తోందని, దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy