Take a fresh look at your lifestyle.

సూర్యపేటలో ఒకే రోజు 16 మందికి కొరోనా పాజిటివ్‌

మొత్తం 39 చేరిన వైరస్‌ ‌బాధితులు
రోజు రోజుకు పెరుగుతున్న కరోనా బాధితులు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి. కాగా గురువారం ఒక్క రోజే 16 కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తంగా చర్యలు చేపడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యాపేట జిల్లాను ఆరెంజ్‌ ‌జోన్‌ ‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. 24 గంటలు గడవకముందే ఒకే రోజు16 కేసులు నమోదు కావడంతో రెడ్‌ ‌జోన్‌లోకి వెళ్తోదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 20 నుండి కొన్ని పరిశ్రమలు అత్యవసర వాటిని సడలి ఇస్తారని అందరూ భావిస్తున్నా సమయంలో ఒకేరోజు 16 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా కేంద్రంలో ఇప్పటికే 14 కేసు నమోదు కాగా ఈ 16 తో మొత్తం 30 కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తుంది. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో సన్నిహితంగా మెలిగిన 14 మందికి, మరొకరు ఆత్మకూరు మండలం ఏపూర్‌ ‌గ్రామానికి చెందిన వ్యక్తి, తిరుమలగిరి మండలానికి చెందిన మరో వ్యక్తికి కొరోనా సోకినట్లు తెలుస్తోంది. అర్బన్‌ ‌హెల్త్ ‌సెంటర్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ ‌నగర్‌, అం‌బేద్కర్‌నగర్‌, ‌గిరినగర్‌ ‌లో ఇంటింటి సర్వే నిర్వహించారు. 673 ఇళ్లను సర్వే చేసి 2662 మందిని ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌ ‌వచ్చిన వారి అనుమానితులను 214 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.

Leave a Reply