Take a fresh look at your lifestyle.

16‌సీట్లతో ప్రధాని అవుతారా?

భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్‌షా16స్థానాల్లో తమను గెలిపించాలని తెరాస నేతలు కోరుతున్నారని, 16 స్థానాల్లో గెలిస్తే సీఎం కేసీఆర్‌ ‌ప్రధాని అవుతారా అంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రశ్నించారు. శంషాబాద్‌లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ‌కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ఎంతో మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబంలోని వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అమిత్‌షా విమర్శించారు. 16 స్థానాల్లో తమను గెలిపించాలని తెరాస నేతలు కోరుతున్నారని, ఆ సీట్లతో కేసీఆర్‌ ‌దేశ ప్రధాని కాగలుగుతారా అని ప్రశ్నించారు. దేశం మొత్తం మోదీ నామస్మరణ వినిపిస్తోందని, మోదీయే ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఇటు తెరాసపైనా, అటు కాంగ్రెస్‌ ‌పైనా విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణ అభివృద్ధి భాజపా కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్‌ ‌మెట్రో కోసం కేంద్రం రూ.1600 కోట్లు ఇచ్చిందని, హైదరాబాద్‌కు బయో డైవర్సిటీ వంటి కేంద్ర సంస్థలను మంజూరు చేసిందన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకోసం కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేశామని, తెలంగాణ అభివృద్ధి కోసం సోనియాగాంధీ, మన్మోహన్‌ ‌సింగ్‌ ఏం ఇచ్చారో కాంగ్రెస్‌ ‌సమాధానం చెప్పాలని అమిత్‌షా నిలదీశారు. తెలంగాణ విమోచన దినం జరిపే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీకి సీఎం కేసీఆర్‌ ‌భయపడుతున్నారని విమర్శించారు. మంచి మెజార్టీతో గెలిచి కూడా రెండు నెలల పాటు మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారని ఎద్దేవాచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌దేశానికి ఏ చేయలేకపోయిందని అమిత్‌షా విమర్శించారు. మాల్యావంటి వారు కాంగ్రెస్‌ ‌హయాంలోనే భారీగా బ్యాంకు రుణాలు తీసుకున్నారన్నారు. ఉగ్రవాదులు ఘాతుకానికి 40మంది సైనికులు చనిపోతే, పాకిస్థాన్‌ను సమర్థించేలా మాట్లాడారని, దేశం మొత్తం గర్విస్తున్న సర్జికల్‌ ‌స్టైక్స్‌న్రు కూడా తక్కువ చేసి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీ కోరుతోందని, కాంగ్రెస్‌ ‌మిత్రపక్షం నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌డిమాండ్‌ను రాహుల్‌ ‌గాంధీ సమర్థిస్తారా అని రాహుల్‌ను అమిత్‌షా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అడుగుతున్నారు… పదేళ్ల కాలంలో యూపీఏ సర్కార్‌ ‌తెలంగాణకి రూ.16,500 కోట్లు ఇస్తే.. ఐదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు రూ.2 లక్షల 35వ వేల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!