- రూ.670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకం
- ఎపి సర్కార్ మరో కీలక నిర్ణయం
- నవరత్నాల అమలునకు క్యాలెండర్
- వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయింపు
- బడ్జెట్ సమావేశాలపైనా చర్చ
- వివరాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని
అగ్రవర్ణ పేదలకు ఎపి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరి సంక్షేమం కోసం కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్టు మంత్రి పేర్నినాని తెలిపారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం వి•డియాతో నాని వివరాలు వెల్లడించారు. రూ.670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసిందని పేర్నినాని తెలిపారు. 45-60 ఏళ్ల ఈబీసీ మహిళలకు మూడేళ్లపాటు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందుతున్నారు. నవరత్నాల అమలు క్యాలెండర్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 23 రకాల సంక్షేమ పథకాలకు నెలవారీగా షెడ్యూల్ ప్రకటించారు. 5.69 కోట్ల మంది పేదలకు క్యాలెండర్ ప్రకారం పథకాలు అమల చేయనున్నట్టు తెలిపారు. జగనన్న విద్యా దీవెనలో సంపూర్ణంగా బోధనా ఫీజు చెల్లింపులు ఉంటాయన్నారు. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపైనే ఏపీ కేబినెట్ ప్రధానంగా చర్చించింది.
2021-22 ఆర్ధిక సంవత్సరంలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల కేలండర్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపడమే కాకుండా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ చేయూత, కాపునేస్తం, నేతన్న నేస్తం మాదిరిగా మరో కీలక పథకాన్ని రంగంలోకి దీంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు మహిళలకు అందిస్తున్న పథకాన్ని ఈబీసీ మహిళలకూ వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వచ్చే మూడోళ్లలో ఒక్కో మహిళా లబ్దిదారుకు ఈసీబీ నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు చొప్పున రూ.45 వేల ఆర్ధిక సాయం అందించనుంది. వచ్చే బడ్జెట్లోనే ఈ పథకానికి సంబంధించిన కేటాయింపులను కూడా జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఇక కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక అంశాలను ఆమోదించింది.
అమరావతి రాజధానిలో అసంపూర్తిగా ఉన్న భవనాలపైనా చర్చ జరిగింది. రాజధాని పరిధిలోని భవనాలను పూర్తి చేసేందుకు అమరావతి రీజియన్ డెవలప్ మెంట్ అధారిటికీ రూ.3వేల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కాకినాడ సెజ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్టపరిహారం చెల్లించే అంశాన్ని ఆమోదించింది. నష్టపరిహారంపై కమిటీ సూచనల కంటే ఎక్కువే చెల్లించాలని నిర్ణయించింది. అలాగే సెజ్ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించా లనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అలాగే కడపలో నిర్మించనున్న వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థకు ఆమోదం తెలిపింది. దీంతో పాటే కడప జిల్లాలో రెండు ఇండస్టియ్రల్ పార్కులకు భూ కేటాయింపులపై చర్చించారు. అసెంబ్లీ బ్జడెట్ సమావేశాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం, టిడ్కో ఇళ్ల కేయాయింపు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, మున్సిపల్ ఎన్నికల వంటి కీలక అంశాలు కేబినెట్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.