Take a fresh look at your lifestyle.

ఎం‌పి రంజిత్‌ ‌రెడ్డికి 1500 కోట్ల ఫిల్మ్‌నగర్‌ ‌భూములు

  • కెసిఆర్‌ ‌చర్యలపై ఎంతకైనా పోరాడుతాం
  • బిజెపి నేతలు దీనిపై స్పందించాలన్న కాంగ్రెస్‌ ‌నేత శ్రవణ్‌

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పాలనలో భూములన్నీ దోపిడీ దారులకు కట్టబెడు తున్నారని, భూములు కాపాడేందుకు ఎంతదూరమైనా వెళ్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌స్పష్టం చేశారు. 1500 కోట్ల రూపాయల విలువైన ఫిల్మ్ ‌నగర్‌ ‌భూములను ఎంపీ రంజిత్‌ ‌రెడ్డికి అడ్డగోలుగా ఇచ్చేసారని ఆయన ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన వి•డియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంచె చేను మేసినట్టుగా అధికార పార్టీ నాయకులు విలువైన భూములు అడ్డగోలుగా తీసుకున్నారని విమర్శించారు. ఎంపీ రంజిత్‌ ‌రెడ్డి, ఇందు శ్యామ్‌ ‌ప్రసాద్‌ ‌రెడ్డిలకు ప్రభుత్వం విలువైన భూములను కట్టబెట్టిందని, 17 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించారని ఆయన ఆరోపించారు.

తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడని బద్నాం చేసిన సీఎం కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి భూములను కాపాడారని, కేసీఆర్‌ ‌తెలంగాణ భూములను దోపిడిదార్లకు అప్పగించారని, ఇందులో కేసీఆర్‌ ‌కు వాటా ఎంత.. ? చెప్పాలని శ్రవణ్‌ ‌ప్రశ్నించారు. ఆంజనేయ స్వామి దేవలయాన్ని కూడా తొలగించి భూములను స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తన నియోజక వర్గంలో ఉన్న ఈ భూముల గురించి మాట్లాడుతారా.. ? గతంలో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి పని చేసారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ వాళ్ళు ఆంజనేయ గుడిని ఎందుకు కాపాడేందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి లేఖ రాశామన్నారు. సంబంధిత అధికారులకు, హోసింగ్‌ ‌బోర్డ్ ‌కు కూడా లేఖలు రాశామని, ఈ విషయంలో ఎంత దూరం అయినా పోతాం, తెలంగాణ భూములు కపడుకుంటాం, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా కాపాడుకుంటామని దాసోజు శ్రవణ్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply