Take a fresh look at your lifestyle.

ఇఎస్‌ఐ ‌స్కాంలో 150 కోట్ల అవినీతి

  • ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించినట్లు గుర్తింపు
  • అచ్చన్నాయుడు సహా మరి కొందరి అరెస్ట్
  • ఏసీబీ జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌రవికుమార్‌ ‌వెల్లడి
మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై ఏసీబీ అధికారులు స్పందించారు. శుక్రవారం ఉదయం 7.30కి అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌రవికుమార్‌ ‌తెలిపారు. వారితో పాటు సీకే రమేష్‌, ‌జి.విజయకుమార్‌, ‌డాక్టర్‌ ‌జనార్దన్‌, ఈ. ‌రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను అరెస్ట్ ‌చేసినట్లు వెల్లడించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.  విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈఎస్‌ఐ ‌స్కామ్‌లో సుమారు 150 కోట్లు అక్రమాలు జరిగాయని వివరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించినట్టు నిర్దారణ జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినట్టు నిర్దారణ జరిగినట్లు తెలిపారు. ఫేక్‌ ఇన్వాయిస్‌తో మందులు కొనుగోలుకు పాల్పడ్డారని చెప్పారు. అచ్చెన్నాయుడు కనీసం ప్రిన్సిపాల్‌ ‌సెక్రటరీ కూడా తెలియకుండా కొన్ని పక్రియలు చేశారన్నారు.
విజిలెన్స్ ‌రిపోర్ట్‌పై ప్రభుత్వ అదేశాలుపై  ఏసీబీ కేసు విచారణ చేస్తూ అరెస్ట్ ‌చేసినట్లుగా  ఏసీబీ జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌రవికుమార్‌ ‌వెల్లడించారు. ఈఎస్‌ఐ ‌స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు నిర్దారణ అయిందని  తెలిపారు. విజిలెన్స్ ‌దర్యాప్తులోనూ ఇది తేలిందని పేర్కొన్నారు. ఈఎస్‌ఐ ‌స్కాంలో విజిలెన్స్ ‌నివేదిక వచ్చిందని, దాని ప్రకారమే తాము దర్యాప్తు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికశాఖా మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించిన పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏసీబీ దర్యాప్తులో అక్రమాలు నిర్దారణ అయ్యాక నిందితులను అరెస్ట్ ‌చేశామని చెప్పారు. విజిలెన్స్ ‌దర్యాప్తులో భాగంగా రూ. 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150 కోట్లపైనా అవినీతి అక్రమాలు జరిగినట్లు తేలిందని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండా నామినేషన్‌ ‌పద్దతిలో కట్టబెట్టారని వెల్లడించారు. విజిలెన్స్ ‌దర్యాప్తులో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పట్లు తేలిన తరువాతనే ఏసీబీ విచారణ జరిపినట్లు తెలిపారు.

Leave a Reply