15మంది విద్యార్థులకు అస్వస్థత

- అల్బెండజోల్ మాత్రలపై అనుమానం
- చికిత్స కొరకు జిల్లా ఆసుపత్రిలో చేరిక
- ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పరామ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్‌నగర్ ప్రభుత్వ ప్రాథ మిక పాఠశాలలో విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పంపిణీ చేశారు. అందులో భాగంగా పాఠశాలకు అందజేసిన మాత్రలకు విద్యార్థులకు ఇచ్చి నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సోమవారం మాత్రలు వేసుకున్న తరువాత కొంత మంది విద్యార్థులు తలనొ ప్పి, కడుపునొప్పి, విరోచనాల లక్షణాలతో ఇబ్బంది పడ్డ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం పాఠశాలకు హాజరైన సుమారు 15 మంది విద్యార్థులు మళ్ళీ తమకు అవే లక్షణాలతో అస్వస్థతకు గురికావడంతో పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు మంజులత వెంటనే విద్యార్థులను సమీపంలో ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి డిఇఓకు సమా చారం చేరవేశారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యా శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశా ఖాధికారి సుధాకర్ ఆసుపత్రిని సందర్శించి వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. గత సంవ త్సరం అల్బెండజోల్ మాత్రల పంపిణి సందర్భంలో పంపిణికి ముందు రోజు అర్థరాత్రి జిల్లా వ్యాప్తంగా సమాచారం అందించి మాత్రల పంపిణిని అర్థాంతరం గా నిలిపివేశారు. ఈ నేపధ్యంలో విద్యార్థుల తల్లిదండ్రు లు ప్రభుత్వం సరఫరా చేసిన అల్బెండజోల్ మాత్రల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శ…
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి సూపరింటెండెంట్ వాసుదేవరెడ్డి ని, డ్యూటీ డాక్టర్లను, ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందజేస్తామని, ఆందోళన చెందవద్దని వారి తల్లిదం డ్రులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Tags: 15 students sicking,Albendazole suspicion,MLA Manohar Reddy