తాండూరు : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 15 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తాండూరు రూరల్ సిఐ జలంధర్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితేశనివారం మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామం సమీపంలో 15 మంది వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘించి పేకాట ఆడేందుకు గుంపులు గుంపులుగా వెళుతుండగా వారిని డ్రోన్ కెమెరాతో గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ జలంధర్ రెడ్డి తెలిపారు. సిఐ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.