Take a fresh look at your lifestyle.

షాహీన్ బాగ్ లో 144 సెక్షన్ 

రెండు నెలలు గా సీఏఏ కు వ్యతిరేకంగా దిల్లీ షాహీన్ బాగ్ లో కొనసాగుతున్న నిరసనల కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందంటూ , ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు విఫల మయ్యారని పేర్కొంటూ మార్చ్ 1 న నిరసన క్లియర్ చేయాలంటూ ఒక సమావేశానికి హిందూ సేన పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా 144 సెక్షన్ విధించారు. ఈ రోజు ఉదయం నుంచి షాహీన్ బాగ్ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు . ఆదివారం తమ శాంతియుత రాలీ ని ఉపసంహరించుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారని హొండు సేన ఆరోపించింది. సేన జాతీయ అధ్యక్షుణ్ణి పోలీసులు అదుపులో తీసుకున్నారని ఆరోపించగా ..ఎవరిని అదుపులో తీసుకోలేదని పోలీసులు పేర్కొన్నారు . షాహీన్ బాగ్ లో రెండు మహిళా దళాలతో సహా పన్నెండు కంపెనీలను మోహరించారు .స్థానిక పోలీసులతో పాటు ..నాలుగు పోలీసు జిల్లాలకు చెందిన 100 మంది యువకులను కూడా నియమించారు

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply