Take a fresh look at your lifestyle.

దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్‌

‌దేవినేని ఫిర్యాదు కూడా చేయలేదు : డిఎస్పీ
విజయవాడ,జూలై 28 : టీడీపీ నేత దేవినేని ఉమకు 14 రోజుల కస్టడీ విధించారు. ఉమను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. హనుమాన్‌ ‌జంక్షన్‌ ‌పోలీస్‌స్టేషన్‌లో జూమ్‌ ‌యాప్‌ ‌ద్వారా.. ఆయనను ఆన్‌లైన్‌లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఉమకు మైలవరం జడ్జి షేక్‌ ‌షేరిన్‌ 14 ‌రోజులు రిమాండ్‌ ‌విధించారు. దేవినేని ఉమను రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు భారీ భద్రత మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమను మైలవరం కోర్టుకు తరలించారు. ఉమను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఆయనను అన్యాయంగా అరెస్ట్ ‌చేశారంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఇదిలావుంటే టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అరెస్టు నేపథ్యంలో డీఎస్పీ కీలక వివరాలు వెల్లడించారు.

ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా సుమారు 4 గంటల పాటు దేవినేని అడిగామని.. అయినా కారులో నుంచి దిగకుండా ఆయన పోలీసులను ఇబ్బంది పెట్టారన్నారు. ఫిర్యాదు ఇవ్వకపోగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవరించారు. తన వర్గాన్ని రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రోత్సహించారన్నారు. పోలీస్‌ ‌స్టేషన్‌కు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు రావచ్చు. ఇరువర్గాలపైనా కేసులు నమోదు చేశాం. ఓ వర్గానికి చెందిన 18 మందిపై, మరో వర్గానికి చెందిన ఆరుగురిపై కేసులు నమోదు చేశాం. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా జి.కొండూరుకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌పై టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దళిత కార్యకర్త సురేష్‌పై కూడా దేవినేని ఉమా అనుచరులు కూడా రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దాడులకు ప్రేరేపించిన దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply