Take a fresh look at your lifestyle.

రేవంత్ రెడ్డి కి 14 రోజుల రిమాండ్.. అరెస్ట్ ని ఖండించి టీ కాంగ్ నేతలు

మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుముల రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది.గురువారం రేవంత్ ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోగానే నర్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ నెల 2 వ తేదీ న రేవంత్ జన్వాడ లోని మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేశారు.కేటీఆర్ 111 జీవో ని ఉల్లఘించి అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించుకున్నరని ఆరోపిస్తూ ఫామ్ హౌస్ ముట్టడించారు ఈ సమయంలో రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా ఉపయోగించారు .ఇది నిబంధనలకు విరుద్ధం దింతో భద్రతకు భంగం వాటిల్లినందున రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన్నట్లు సమాచారం .మొత్తం 8 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు.వీరి పై ఐపీసీ 184 ,187 , 11 రెడ్ విత్ 5ఏ ,ఎయిర్ క్రాఫ్టు యాక్ట్ కింద కేసు లు నమోదు చేశారు.గోల్కొండ ఏరియా ఆసుపత్రి లో రేవంత్ రెడ్డి కి వైద్య పరీక్షలు నిర్వహించి రేవంత్ రెడ్డి ని ఉప్పరపల్లి లోని సంజీవనిహిల్స్ హైదర్ గూడలో ఉన్న న్యాయ మూర్తి ఎదుట హాజరు హాజరుపరిచారు. రేవంత్ రెడ్డి కి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్.రేవంత్ రెడ్డి ని పోలిసులు చర్లపల్లి జైలు కు తరలించారు .

రేవంత్ అరెస్ట్ ని ఖండించిన టీపీసీసీ నేతలు:

14 day remand for Revant Reddy

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,మాజీ మంత్రి షబ్బీర్ అలీ ,మాజీ ఎమ్మెల్యే సంపత్ ఇతర నాయకులు ఖండించారు.గురువారం రేవంత్ అరెస్ట్ అనంతరం పార్టీ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదలైంది .రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన నడుస్తుందని ఇంత ఘోరమా ఇష్టానుసారంగా ఒక ఎంపీ ని అరెస్ట్ చేయడమేంటని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు .ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా.. ! తెలంగాణలో ఒక నియంత పాలన సాగుతుందని రాజ్యాంగం, చట్టం లేకుండా కల్వకుంట్ల రాజ్యాంగం అమలు అవుతుందని మండిపడ్డరు. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని ఇలాగే ఈ దుర్మార్గ పాలన కొనసాగితే ఎవ్వరు మాట్లాడలేరని షబ్బీర్ అలీ అన్నారు.కల్వకుంట్ల అప్రజాస్వామిక పాలనపై కలిసికట్టుగా ఉద్యమించాలని నేతలు పేర్కొన్నారు.

Leave a Reply