Take a fresh look at your lifestyle.

13168 ‌మెగావాట్లకు చేరినవిద్యుత్‌ ‌డిమాండ్‌

13168 megawatts of electrical power demand

  • రాష్ట్రంలో పెరుగుతున్న కరెంట్‌ ‌వినియోగం
  • డిమాండ్‌ ఎం‌త పెరిగినా  సరఫరా చేస్తాం : ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండి ప్రభాకరరావు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తేదీ నుంచి  విద్యుత్తు డిమాండ్‌ అనూహ్య రీతిలో పెరిగిపోతున్నది. శుక్రవారం విద్యుత్తు డిమాండ్‌ అత్యధికంగా 13168 మెగావాట్లకు చేరుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌డిసెంబర్‌ ‌చివరివారంలోనే విద్యుత్తు  డిమాండ్‌ ఈ ‌సారి  చాలా పెరుగుతుందని అధికారులను  అప్రమత్తం చేశారు. సీఎం ఊహించినట్లుగానే డిమాండ్‌ ‌ఫిబ్రవరిలోనే పీక్‌స్జేజీకి వచ్చిందని విద్యుత్తు సమీక్షంలో అధికారులు పేర్కొన్నారు,.. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల పథకాలు శరవేగంగా అమలులోకి రావడం, అనేకపంపు హౌజ్‌ల నుంచి విద్యుత్తు వినియోగంతో జలధారలు  పొంగిపొర్లడంతో విద్యుత్తు డిమాండ్‌ ‌చాలా ఎక్కువగా పెరగిందని అధికారులు ప్రకటించారు. ఒకవైపున ఈ డిమాండ్‌ ‌మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండి ప్రభాకర్‌రావు అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల పరిధిలో 2014 మార్చి 23న 13162 మెగావాట్లకు డిమాండ్‌ ‌చేరుకున్నది. ఆ సందర్భంలో విద్యుత్తు వినియోగం తారస్థాయికి చేరుకున్నదని, విద్యుద్తు అధికారులు , నిపుణులు ఆవ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కాగా ఉమ్మడి పదిజిల్లాల పరిధిలోనే  ఫిబ్రవరి 29 వ తేదీ నాటికే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా ఎక్కువగా డిమాండ్‌ ‌పెరిగి 13168 మెగావాట్లకు  చేరుకోవడంతో రాష్ట్రంలోని విద్యుత్తుశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

 

2019- ఫిబ్రవరిలో డిమాండ్‌ 9620 ‌మెగావాట్లు మాత్రమే ఉండేది.అయితే ఈ డిమాండ్‌ ఇం‌కా పెరిగినా ఎటువంటి ఇబ్బందిలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండి స్పష్టం చేశారు.సీఎం తమను ముందుగానే అప్రమత్తం చేశారని, అదేవిధంగా ఎప్పటికప్పుడు డిమాండ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారని,ఆదేశాలు ఇస్తున్నారని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండి వివరించారు. ఏప్రిల్‌ ‌నాటికి వ్యవసాయ పంపుసెట్లకు ఎక్కువ విద్యుత్తు అవసరమవుతుందనే అంచనాలతో డిమాండ్‌ను నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని 24వేల వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన విద్యుత్తును 24 గంటలపాటు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని  మెట్రోరైలు ప్రాజెక్ట్‌కు 150 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతున్నదని అధికారులు పేర్కొన్నారు.సాగువిస్తీర్ణం పెరగడం, వ్యవసాయపంపుసెట్ల సంఖ్య ఎక్కువకావడం, ఎత్తిపోతల పథకాల్లో విద్యుత్తు  వినియోగం చాలా పెరగడం వంటి కారణాలతో విద్యుత్తు డిమాండ్‌ ‌చాలా పెరిగినట్లు అధికారులు నిర్ధారించారు.అవసరాలకు అనుగుణంగా నాగార్జునసాగర్‌, శ్రీ‌శైలంలలో జలవిద్యుత్తు ఉత్పత్తి కూడా పెరిగింది. జలవిద్యుత్తును  డిమాండ్‌ ఎక్కువ అవసరమైన సమయాల్లో వినియోగిస్తున్నారు. అయితే మరె• రెండు నెలల వరకు ఇదేరీతిలో డిమాండ్‌ ‌పెరిగే అవకాశం ఉన్నది. అవసరాలకు  డిమాండ్‌నకు అనుగుణంగా  విద్యుత్తును సరఫరా చేసేవిధంగా అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

Leave a Reply