సంగారెడ్డిలో 130 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ నేత,సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయ ప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డీ ప్రకటించారు. ఆయన గురువారం హైదరాబాద్ లో. మాట్లాడుతూ….ఇప్పుడు ప్రపంచమంతా గాంధేయ మార్గంలో నడుస్తుందన్నారు. గాంధీ ఆశయాలను కొనసాగింపులో భాగంగా సంగారెడ్డిలో 130 అడుగుల గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు జగ్గారెడ్డీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ అగ్ర నేతలైన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తానని తెలిపారు.దేశంలో భారతీయ జనతా పార్టీ నేతలు మతం పేరుతో రెచ్చ గొడుతున్నారన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపీ అనంత కుమార్ హెగ్డే దేశానికి క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డీ డిమాండ్ చేశారు.