వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఫలించిన హరీష్‌ ‌రావు మంత్రాంగం ఉమ్మడి జిల్లాలలో 13 మున్సిపాలిటీలు కైవసం

January 26, 2020

13 municipalities, seats wonjoint districts, minister Harish Rao, narayan kahd

మెదక్‌,‌జనవరి25(ప్రజాతంత్ర ప్రతినిధి): ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో టీఆర్‌ఎస్‌ ‌విజయ దుందుబీ మోగించింది. మంతరి హరీష్రావు మంత్రాంగం ఫలించింది. దీంతో మొత్తం 14 మున్సిపాలిటీల్లో 13 చోట్ల టీఆర్‌ఎస్‌ ‌విజయం సాధించింది. నారాయన్‌ఖేడ్‌ ‌మున్సిపాలిటీని కాంగ్రెస్‌ ‌హస్తగతం చేసుకుంది. ఫలితాలపై గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డితో పాటు సదాశివపేట మున్సిపాలిటీలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. రెండు మున్సిపాలిటిల్లోనూ జగ్గారెడ్డికి ఓట్లర్లు దిమ్మతిరిగే రీతిలో షాక్‌ ఇచ్చారు. సంగారెడ్డిలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలు రాలేదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్‌ ఎం‌తో ప్రతిష్టాత్మకంగా భావించింది. అయినా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జగ్గారెడ్డి విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్‌ ‌బరిలోకి దిగింది. దీనికి అనుగుణంగానే సీఎం కేసీఆర్‌ ‌మంత్రి హరీష్‌ ‌రావుకు సంగారెడ్డి, సదాశివపేట బాధ్యతలు అప్పగించారు. దీంతో హరీష్‌ ‌మొదటి నుంచీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తూ.. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీనికి తగట్టుగానే హస్తం అభ్యర్థులను మట్టికరిపిస్తూ సంగారెడ్డిపై గులాబీ జెండా ఎగరేశారు.

Tags: 13 municipalities, seats wonjoint districts, minister Harish Rao, narayan kahd