Take a fresh look at your lifestyle.

పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం లో 13మంది మృతి

తీవ్ర దిగ్భ్రాతిని వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్రంలో మంగళవారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్రంలోని జల్పాయ్‌ ‌గురి జిల్లా దూప్‌గురి నగరంలో పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక పోవడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికి అక్కడే మరణించారు. ఈ ప్రమాద ఘటనలో మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, సహాయ సిబ్బంది హుటాహుటిన దుర్ఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పొగమంచు కారణంగానే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతిచెందడం తీవ్ర మనోవేదన కలిగించిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఇంతటి బాధాకరమైన సమయంలో మృతుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నేషనల్‌ ‌రిలీఫ్‌ ‌ఫండ్‌ ‌నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. అదేవిధంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Leave a Reply