Take a fresh look at your lifestyle.

1200 ‌మంది ఆత్మ బలిదానాలు.. ఎందరో పోరాట ఫలితం

కెసిఆర్‌ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు
ఐదోరోజు ప్రజాదీవెన యాత్రలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌
కేసీఆర్‌ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దాదాపు 1200మంది ప్రాణత్యాగం, ఎందరో కొట్లాట వల్ల తెలంగాణ వొచ్చిందన్నారు. అయితే కెసిఆర్‌ ‌మాత్రం తానొక్కిడినే కొట్లాడి తెలంగాణ తెచ్చినట్లు ప్రచారం చేయడం దారుణమన్నారు. జమ్మికుంట మండలంలో ఐదో రోజు ప్రజా దీవెన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఏనాకు బంగారు పల్లెంలో పెట్టి పదవి ఇచ్చిన అంటున్నవు…బంగారు పల్లెంలో పెట్టి నీ బిడ్డకు భీ ఫామ్‌ ఇచ్చావు..గెలిచిందా కేసీఆర్‌’ అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ వినోద్‌ ‌కుమార్‌కు బంగారు పల్లెంలో పెట్టి భీఫాం ఇచ్చావు…ఆయన గెలిచిండా అని అన్నారు.

ఇవ్వడం అనేది కేసీఆర్‌ ‌వంతు..గెలవడం మాత్రం కష్టపడిన వాళ్ళ వంతు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ‌వోటుకు రూ.10 వేలు ఇచ్చినా..ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా అని ఈటల రాజేందర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌దళితుడిని సీఎం చేస్తానని చేయలేదని ఈటల రాజేందర్‌ ‌ధ్వజమెత్తారు. గతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ప్రకటించిన కేసీఆర్‌ ఆ ‌మాటను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు కూడా వోట్ల కోసమే దళిత బంధు ఇస్తామంటున్నారని విమర్శించారు. తాజా పరిణామాలు చూస్తుంటే హుజురాబాద్‌ ‌రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నట్లు కనిపిస్తుంది.

Leave a Reply