Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 1114 మందికి పాజిటివ్‌..12 ‌మంది మృతి

రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1114 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1280 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 12 మంది మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 129 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 75 కేసులు, నల్లగొండ జిల్లాలో 72 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,16,688 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,598కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,96,628 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 16,462గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply