Take a fresh look at your lifestyle.

నూతన వేడుకలకు 110 టీంలతో డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌తనిఖీలు: సిపి

city comissioner cp ravindhar
సమావేశంలో మాట్లాడుతున్న సిపి రవీందర్‌

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు వందకుపైగా డ్రంక్‌ ‌డ్రైవ్‌ ‌టీంలు విధులు నిర్వహిస్తారని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమీషనర్‌ ‌నగర ప్రజలకు సూచించారు. పోలీస్‌ ‌కమీషనరేట్‌ ‌పరిధిలో ఈ నెల 31వ తేది ఆర్థ్రరాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో వుంచుకోని పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు ప్రతి ఇంట ఆనందోత్సవాల నడుమ నిర్వహించుకోవడంతో పాటు, జిరో యాక్సిడెంట్‌ ‌డేకై వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో వాహనదారులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకు నేందుకుగాను ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని.

ముఖ్యంగా గత అనుభవాల దృష్టా యువత మద్యం సేవించి నిర్లక్ష్య ధోరణితో వాహనాలను అతివేగంగా నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావడంతో పాటు కోన్ని సందర్బాల్లో వాహనదారులతో పాటు సాధరణ ప్రజలు తీవ్ర గాయాలకు గురై ఆకాలంగా మరణిస్తున్నారని ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నియంత్రణకై కమీషనరేట్‌ ‌పరిధిలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నగరంలో ముమ్మరంగా పెట్రోలింగ్‌ ‌నిర్వహిం చబ డుతుందన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహ నాలను నడిపే వాహనదారులను కట్టడి చేసేందంకై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ఇందుకోసం వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమీషనరేట్‌ ‌పరిధిలో మొబైల్‌ ‌పోలీస్‌, ‌ట్రాఫిక్‌, ‌లా అండ్‌ ఆర్థర్‌ ‌పోలీస్‌ ‌విభాగాలతో 110 డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌టీంలతో తనీఖీలు నిర్వహించడంతో పాటు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకుగాను అన్ని ప్రధాన రోడ్డు మార్గాల్లో రోడ్లపై బారీకెడ్లను ఏర్పాటు చేయబడుతాయని తెలిపారు. ముఖ్యంగా యువత నూతన సంవత్సర వేడుకలను మద్యంతో కాకుండా కుటుంబ సభ్యుల నడుమ సంతోషాలతో నిర్వహించుకోవాలని, రాబోవు కోత్త సంవత్సరంలో ప్రజలు తాము నిర్థేషించుకున్నా లక్ష్యాలను చేరుకోవాలని, ప్రతి ఇళ్ళు, ప్రతి వాడ, ఊరులోను సుఖ సంతోషాలకు నెలవు కావాలని ఆకాంక్షిస్తూ వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమీష నరేట్‌ ‌తరుపు ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షల ను పోలీస్‌ ‌కమీషనర్‌ ‌తెలిపారు. విలేకరుల సమావే శంలో నాగరాజు, పలువురు ఏసిపిలు పాల్గొన్నారు.

Tags: With 110 Teams, for New year Celebrations,Drunk and Drive, city commissioner CP

Leave a Reply