వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంకు చెందిన మూడేళ్ల చిన్నారి శరీ రంలో 11 సూదులు బయటపడ్డాయి. అవి శరీరంలోకి ఎలా వెళ్లాయి ఎవరైన జొప్పించార, అనేది తెలియలేదు. మండల కేంద్రానికి చెందిన పెబ్బేటి అశోకు అన్నపూర్ణ కు ఇద్దరు కూతుళ్లు , ఒక కొడుకు ఉన్నాడు. కుమారుడు లోక్‌నాథ్ 3 సంవత్సరాలు ఈ మధ్య తరుచు అనారోగ్యానికి గురవుతున్నాడు. వారం క్రితం తల్లిదండ్రులు ఆ చిన్నారికి స్నానం చేయిస్తుండగా మజిల్ లోంచి బయటికి చొచ్చుకురావడంతో ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్లు స్క్యాన్ చేయగా నడుం కింది భాగంలో 11 సూదులు ఉన్నట్లు తేలింది. దీంతో చిన్నారి తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో కావాలనే ఇలా చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. చిన్నారిని చికిత్స కోసం వనపర్తి ఆసుపత్రికి తరలించి శరీరంలో ఉన్న 8 సూదులను తొలగించినప్పటికి మరో 2 సూదులు శరీరంలోపలే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మిగిలిన సూదులను కొన్ని రోజుల మాత్రమే తీయుటకు వీలవుతుందని వైద్యులు తెలిపారని వారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.