Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ బోయిగూడా లో భారీ అగ్నప్రమాదం

సికింద్రాబాద్‌ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్‌, తుక్కు (స్క్రాప్‌) గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద సమయంలో టింబర్‌డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్‌డిపోతోపాటు స్క్రాప్‌ గోదాం కూడా ఉంది. టింబర్‌ డిపో నుంచి స్క్రాప్‌ గోదాముకు మంటలు వ్యాపించినట్లు సమాచారం.

Leave a Reply