Take a fresh look at your lifestyle.

నాగసముందర్‌ ‌గ్రామంలో 11 పశువులు మృతి

వికారాబాద్‌ : ‌పశువులు రోగాల బారిన పడి చనిపోకుండా ఉండాలంటే మందులను గ్రామాల్లో అత్యవసర పరిస్థితిలో ఉంచాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ ‌తెలిపారు. ఆదివారం అకస్మాత్తుగా ధారూర్‌ ‌మండలం లోని నాగసముందర్‌ ‌గ్రామంలో 11 పశువులు (7 ఆవులు, 1 గేదె, 3 లేగదూడలు) చనిపోయినందున ఆ గ్రామంలో పర్యటించారు. మండలంలోని నాగారం గ్రామంలో కరెంట్‌ ‌షాక్‌తో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు. నాగసముందర్‌ ‌గ్రామంలో చనిపోయి ఉన్న పశువులను, అవి చనిపోవాడానికి గల కారణాలను రైతు గోనెల రాములును, పశువైద్య అధికారులను, తహశీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. వాడిపోయిన జొన్నని తినడం వల్ల(నాముఎక్కి) పశువులు చనిపోయాయని, పశువైద్య అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చికిత్స చేసి 4 పశువులను బ్రతికించారని, మిగతా పశువులు 1 బర్రె, 7 ఆవులు, 3 లేగలు మరణించాయని అధికారులు, రైతు తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ ‌మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ఆదుకోవడానికి డాక్టర్‌ ‌కాకుండా ఒతర సిబ్బందికి కూడా ట్రైనింగ్‌ ఇవ్వాలని, ఎమర్జెన్సీ మందులు గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని, దానివల్ల డాక్టర్లు సంఘటన స్థలాన్ని చేరుకునేలోపే చికిత్స అందించే అవకాశం ఉంటుందని అన్నారు. రైతు గోనెల రాములు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వెటర్నరీ డాక్టర్‌ ‌ధారూర్‌ ‌తహసీల్దార్‌, ‌సర్పంచ్‌లు ఉన్నారు. నాగారం గ్రామంలో కరెంట్‌ ‌షాక్‌ ‌వల్ల మరణించిన 22 ఏళ్ళ గౌసుద్దీన్‌ ‌కుటుంబాన్ని పరామర్శించారు.

Leave a Reply